ఆడపిల్లనైతే మహేష్ ని వెంటాడేవాడిని- పోసాని
పోసాని ఏం మాట్లాడినా అందులో నిజాయితీ ఉంటుంది. సూటిగా తూటాలా పేల్తుంది. అతడు తనదైన వాక్చాతుర్యంతో అహూతుల్ని కడుపుబ్బా నవ్వించడంలో ఘనాపాటి. సెటైర్ వేసి మంట పుట్టించడంలోనూ ధిట్ట. మనసులో ఉన్న మాటను సూటిగా అనేయడంలో ఆయనలోని మేధావి బయటపడుతూనే ఉంటాడు. నటుడు -దర్శక రచయితగా ఆయన వందలాది సినిమాలకు పని చేశారు. అంతటి చతురత.. అంతటి సెటైర్ లేకపోతే ఇంత ఎదిగేవాడే కాదేమో. ప్రతిసారీ ఆయన వేదికలెక్కి పేల్చే చమక్కు మామూలుగా ఉండదు. గుండెలు చెక్కలయ్యే పంచ్ లు వేస్తాడు. కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తాడు. నిజాయితీగా మాట్లాడితే అందులో ఇంత నిజం ఉంటుందా.. అని ఆశ్చర్యపోయేలా చేస్తాడు. కామన్ జనం తాము చెప్పాలనుకుని చెప్పలేనివి కూడా ఆయన కుండబద్ధలు కొట్టినట్టు నిజాయితీగా చెప్పేస్తూ అందరి చేతా మెంటల్ కృష్ణ అన్న బిరుదును అందుకున్నాడు. ఏదైతేనేం ఈ సువిశాలమైన రంగుల ప్రపంచంలో ఆయన తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించిన సంగతిని ఒప్పుకుని తీరాలి.
ఇండస్ట్రీలో ఏ హీరోని అయినా.. పొగడాలన్నా.. తిట్టాలన్నా.. తనకు నచ్చని ఏ ప్రముఖుడిని అయినా చీల్చి చెండాడాలన్నా.. ఆ గుండె ధైర్యం ఉన్న ఒకే ఒక్కడు పోసాని మాత్రమే. రచయితగా ఉన్న తొలినాళ్లలో నా జీతం ఎగ్గొట్టారు.. అంటూ ఇండస్ట్రీలో దిగ్గజాలనే ఏకి పారేసిన పోసాని ఎన్నో సందర్భాల్లో ఫలానా అంటూ తిట్టేసిన సందర్భాలున్నాయి. పలువురు హీరోల్ని సూటిగా విమర్శిస్తూ మాట్లాడిన ధైర్యం కూడా పోసానికే ఉంది.
నేడు మహర్షి ప్రచార వేడుకలో మహేష్ పై పోసాని ఛమక్కులు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఈ వేదికపై పోసాని మాట్లాడుతూ తాను ఆడపిల్లనై పుడితే కచ్ఛితంగా మహేష్ ని పెళ్లాడేసేవాడిని అంటూ అహూతులను కడుపుబ్బా నవ్వించారు. ఆ వేదికపై ఉన్న మహేష్ అయితే ఉగ్గబట్టి పసిపిల్లాడిలా నవ్వేశారంతే. వేదికపై పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ - ``ఈ సినిమాలో మహేష్‌బాబు చాలా అందంగా ఉన్నాడు. నేనే కనుక ఆడపిల్లనై ఉండుంటే తను పెళ్లి చేసుకునే వరకు వెంటపడేవాడిని. ఒకవేళ పెళ్లి అయిపోయుంటే.. ఏదో ఒక ప్లేస్ ఇస్తే చూసుకుంటూ ఉండిపోతానని చెప్పేసేవాడిని`` అంటూ ఛమక్కు విసిరారు. బావుందండోయ్ .. ఆంధ్రా తెలంగాణలో అమ్మాయిలందరి ఫీలింగ్ ని ఆయన ఇలా వేదికలెక్కి చెప్పేస్తే ఎలా? గుట్టు రట్టయిపోదూ.. 40 ప్లస్ లోనూ ఇంకా 16 ప్రాయం కాలేజ్ కుర్రాడిలా మహేష్ మెయింటెయిన్ చేస్తుండడం అందరికీ షాకిస్తూనే ఉంది.