డస్ట్ బిన్ లో పడేస్తారు నన్ను
టాలీవుడ్ లో ప్రస్తుతం నటుడిగా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్న పోసాని కృష్ణ మురళి స్వభావం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనసులో ఏది అనిపించినా నిర్మొహమాటంగా చెప్పేస్తారు. మొదట రచయితగా పనిచేసినా ఆయన నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో వివాదాలను రేపే పోసాని మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ప్రస్తుతం సినిమాల్లో ఎంతో మంది నటులున్నా తాను నటనలో ఇంకా రాణిస్తున్నాని, అంతే కాకుండా నటుడిగా బిజీ అవ్వడం వల్లే మాటలు- దర్శకత్వం వంటి పనులను పక్కనపెట్టానని చెప్పారు. అంతే కాకుండా ఒకవేళ సినిమాలకు వీడు పనికిరాదు అనుకుంటే మాత్రం డస్ట్ బిన్ లో పడేయడం ఖాయమని చెప్పారు. కానీ గత కొన్నేళ్లుగా తన నటనతో వారికి ఇంకా పనికొస్తూనే ఉన్నానని చెప్పారు. అలాగే తనను డస్ట్ బిన్ లో పడేయాలంటే నటనలోనే కాదు రచయితగాను తనకంటే బాగా టాలెంట్ మరియు దమ్మున్నోళ్లు రావాలని, ఒకవేళ అటువంటి వారు వస్తే తనకి బయమేస్తుందని తెలిపారు. ప్రస్తుతం పోసాని ఎన్టీఆర్ - జై లవ కుశ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.
ఈ మధ్యన ప్రతీ న్యూస్ ఎఫైర్ పైనా పోసాని తనదైన స్టయిల్లో స్పందిస్తూనే ఉన్నారు. అయితే చాలాసార్లు ఆ స్పందన మిస్ ఫైర్ అవుతోంది కూడా. అసలు అనవసరమైన వాటిపై కూడా స్పందించడం ఆయన మానుకుంటే బెటర్ అనేది సినిమా ప్రియుల అభిప్రాయం.