కులం పేరుతో ఓట్ల‌డ‌గ‌లేదు: పోసాని

Update: 2017-11-11 13:00 GMT
టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు పోసాని కృష్ణమురళి. ముక్కుసూటిగా మాట్లాడ‌డం, కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌న‌ట్లుగా ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పేయడం ఈ విల‌క్ష‌ణ న‌టుడి నైజం. రీల్ లైఫ్ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లో కూడా పోసాని సేమ్‌ యాటిట్యూడ్ ని మెయింటెన్ చేస్తారు. గ‌తంలో పోసాని రాజ‌కీయాల‌పై, కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌పై త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. 2009లో ప్ర‌జారాజ్యం త‌ర‌పున పోసాని పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా అప్ప‌ట్లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో తాను కులం పేరు చెప్పుకుని ఓట్లు అడిగాననే విమర్శలల‌లో వాస్త‌వం లేద‌ని పోసాని చెప్పారు.

ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఓట్లు అడిగేందుకు ఇంటింటికి తిరుగుతున్నాన‌ని, ఓటు వేయమని అడిగేందుకు ఓ ఇంటికి వెళ్లాన‌ని తెలిపారు. త‌న‌కు ఓటు వేయమని ఓ ఇంటావిడను అడిగాన‌ని, ఇంట్లోకి  కూర్చున్నాన‌ని చెప్పారు. తాను కాపుల పార్టీలో నిలుచున్నాన‌ని, కాపులు గెలిస్తే.. మనల్ని.. కమ్మోళ్లని బతకనివ్వర‌ని ఆమె చెప్పింద‌న్నారు. తాను మంచోడినైనా ఆ కార‌ణంతోనే ఓటు వెయ్య‌న‌ని, వేరే వాళ్లకు ఓటేస్తాన‌ని చెప్పింద‌న్నారు. క‌నీసం టీ అయినా ఇస్తావా అని అడిగాన‌ని, టీ ఇచ్చి పంపేసింద‌ని గుర్తు చేసుకున్నారు. ఆ ఘ‌ట‌న మిన‌హా కులానిక సంబంధించిన అంత‌కు మించి ఏమీ జరగలేద‌ని, తాను కులం పేరు చెప్పి ఓట్ల‌డిగాన‌న్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని అన్నారు.
Tags:    

Similar News