మెగా బ్రదర్ కి పోసానితో పోటీ
మెగా బ్రదర్ నాగేంద్ర బాబు అనేక రంగాల్లో తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాడు. మొదటగా అన్నకు విధేయుడిగాను.. ఫ్యామిలీకి అండగానే కాకుండా.. అప్పుడప్పుడూ కేరక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. మధ్యమధ్యలో నిర్మాతగా ప్రయత్నిస్తుంటాడు. వీటితో పాటు జబర్దస్త్ కామెడీ షోకి జడ్జ్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నాడు మెగా బ్రదర్.
ఇలాంటి ప్రోగ్రాంను డిజైన్ చేసేందుకు చాలానే ఛానల్స్ ప్రయత్నించినా ఇప్పటివరకూ సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు స్టార్ మా ఛానల్ గా మారిన మాటీవీ.. దేశముదుర్లు అంటూ కొత్త ప్రోగ్రాంను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ఇది కూడా జబర్దస్త్ టైపులో సాగే కామెడీ గేమ్ షోనే. ఈ కార్యక్రమానికి పోసాని కృష్ణమురళి జడ్జ్ గా రానుండడం హైలైట్ గా నిలవనుంది. తనదైన కామెడీ టైమింగ్ తో.. మాడ్యులేషన్ తో పోసాని ఈ కార్యక్రమాన్ని రన్ చేయడం ఖాయం.
ఇప్పటివరకూ జబర్దస్త్ రేంజ్ ను నిలబెట్టిన జడ్జ్ గా నాగేంద్రబాబుకి కూడా మార్కులు పడతాయి. ఇపుడు ఈయనకు సరైన పోటీ ఇచ్చేందుకు పోసాని వచ్చేస్తున్నాడు. రానున్న కాలంలో వీరిద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/