• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సైరా'లో పూనమ్ కౌర్?

'సైరా'లో పూనమ్ కౌర్?

By - Tupaki Desk
Update: 2018-08-16 10:00 GMT
పూనమ్ కౌర్ సినిమా కెరీర్ ముగిసిపోయే చాలా కాలమే అయింది. ఈ పాటికి అందరూ ఆమెను మరిచిపోయి ఉండాలి. కానీ ఆమె వేరే కారణాలతో వార్తల్లో నిలిచింది. మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆమెకు ఆశ్చర్యకర రీతిలో కొన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈటీవీతో కలిసి బాహుబలి నిర్మాతలు ప్రొడ్యూస్ చేసిన భారీ సీరియల్ ‘స్వర్ణ ఖడ్గం’లో కీలక పాత్ర చేసే అవకాశం పూనమ్ కు దక్కడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇక తాజాగా ఆమె ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి క్రేజీ మూవీలోనూ కనిపించింది. పవన్ కళ్యాణ్ ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ వస్తున్న పూనమ్ కు పవన్ వీరాభిమాని అయిన నితిన్ సినిమాలో అవకాశం దక్కడంపై రకరకాల కామెంట్లు పడ్డాయి. కట్ చేస్తే ఇప్పుడు పూనమ్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’లో నటించే అవకాశమున్నట్లు వస్తున్న వార్తలు మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

వివిధ భాషల నుంచి భారీ తారాగణం నటిస్తున్న ‘సైరా’లో ఓ కీలక పాత్ర కోసం ముగ్గురు హీరోయిన్లను ఇటీవలే ఆడిషన్ చేశారట. ఆ ముగ్గురిలో పూనమ్ ఒకరు. మిగతా ఇద్దరు సీనియర్ హీరోయిన్ రంభ.. ‘ఆనందం’ భామ రేఖ. ఐతే రంభకు ఆడిషన్ జరిగాక ఆమె ప్రెగ్నెంట్ అని తేలడంతో ఇక సినిమాలో నటించే అవకాశం లేనట్లే. రేఖ విషయానికి వస్తే ఆమె పూర్తిగా షేపవుట్ అయిపోయింది. జనాలు ఆమెను మరిచిపోయారు కూడా. అంతో ఇంతో వార్తల్లో నిలుస్తున్నది పూనమే కాబట్టి ఆమెనే ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు. కానీ పవన్ ను టార్గెట్ చేసిన పూనమ్ కు చిరు సినిమాలో అవకాశం దక్కితే రకరకాల అనుమానాలు కలుగుతాయి. పవన్ అభిమానులు ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ చిత్ర బృందం మాత్రం పూనమ్ కే ఛాన్సిస్తుందని అంటున్నారు. మరి ఇందులో పూనమ్ పాత్ర ఎలా ఉంటుందో.. ఆమెను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Tags:    
  • Poonam Kaur 
  • Chiranjeevi 
  • Sye raa Movie 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS