• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జక్కన్న టీంలో చేరిన...

జక్కన్న టీంలో చేరిన ‘పూజా’.. కీలక బాధ్యతలు దక్కనున్నాయా?

By - Tupaki Desk
Update: 2022-10-22 05:30 GMT
దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ తో ఫుల్ బీజీగా గడుపుతున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'ను ఇప్పుడు ప్యాన్ వరల్డ్ స్థాయిలో నిలబట్టేందుకు తనశక్తి మేర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 'ఆర్ఆర్ఆర్' మూవీని జపాన్ భాషలో రిలీజు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈనేపథ్యంలో గత రెండ్రోజులుగా 'ఆర్ఆర్ఆర్' టీం జపాన్ రాజధాని టోక్యోలో విస్కృతంగా పర్యటిస్తున్నారు. పనిలో పనిగా హాలీడ్ ట్రిప్పును సైతం వారంతా ఎంజాయ్ చేస్తున్నారు. టోక్యోలోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శిస్తూ అక్కడి విశేషాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే టోక్యోలో 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రీమియర్ షోను రాజమౌళి టీం అక్కడి అభిమానులతో కలిసి వీక్షించారు.

అంతకు ముందు 'ఆర్ఆర్ఆర్' బృందం టోక్యో వీధుల్లో సందడి చేశారు. ఒకరి చేతుల్లో ఒకరు చేయి పట్టుకొని రోడ్డు దాటారు. ఈ వీడియోకు ఆర్ఆర్ఆర్ లోని 'దోస్తీ' పాటను జోడించారు. దీనిని రాంచరణ్, ఎన్టీఆర్ తమ సోషల్ అకౌంట్లలో పోస్టు చేశారు.  ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియోలో మెగా పవర్ స్టార్ రాంచరణ్-ఉపాసన, యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రణతి దంపతులతో పాటు రాజమౌళి కుమారుడు కార్తీకేయ, అతడి భార్య పూజా ప్రసాద్ ఉన్నారు. ఇప్పటి వరకు రాజమౌళి టీంలో అతని భార్య రమ రాజమౌళి, కుమారుడు కార్తీకేయ, అన్నయ్య కీరవాణి, తండ్రి విజయేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు.

జపాన్లో 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ చూశాక పూజా ప్రసాద్ కూడా  రాజమౌళి టీంలో చేరినట్లుగా కన్పిస్తోంది. రాజమౌళి కుమారుడు కార్తీకేయ తన తండ్రికి డైరెక్షన్లో సహకారం అందిస్తుండగా, రమ రాజమౌళి కస్ట్యూమ్ డిజైనర్ గా వ్యహరిస్తున్నారు. రాజమౌళి అన్నయ్య కీరవాణి సంగీతపరంగా, తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ పరంగా సహకరిస్తున్నారు.

పూజా ప్రసాద్ కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఆమె తండ్రి ప్రముఖ నిర్మాత బీవీ రాజేంద్ర ప్రసాద్ మనువరాలు. నటుడు కమ్ హీరో జగతి బాబుకు మేనకోడలు. కర్ణాటక గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న పూజా ప్రసాద్ ను కార్తీకేయ వివాహం చేసుకున్నాడు. ఇక ఆమె సైతం ఇప్పుడు పూజా రాజమౌళి కూడా రాజమౌళి చేరినట్లు అర్థమవుతోంది.

దీంతో పూజాకు రాజమౌళి టీంలో కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అయితే రాజమౌళి పూజాకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఏదిఏమైనా రాజమౌళి కుటుంబ సభ్యులంతా సినిమా రంగంలోని ఏదో ఒక డిపార్ట్ మెంట్లో రాణిస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

For Video >> https://youtube.com/shorts/6IGZzTfuGM0?feature=share
Tags:    
  • RRRMovie 
  • YoungTigerNTR 
  • RamCharan 
  • SSRajamouli 
  • Upasana 
  • TollywoodFilm 
  • RRRFilmJapanPromotions 
  • PoojaRajamouli 

Similar News

ENE Repeat Trailer: పర్ఫెక్ట్ కట్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS