VD కోసమే పవన్ సినిమాని వదులుకుందా..?
ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ముందు వరుసలో ఉంటుంది. హిందీలో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నా.. తెలుగు సినిమాలను మాత్రం వదులుకోవడం లేదు. ప్లాప్స్ వస్తున్నా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు మరియు ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించిన పూజా.. పలు ఆసక్తికరమైన చిత్రాలను లైన్ లో పెట్టుకుంది. అయితే ఇప్పుడు అందులో ఓ ప్రాజెక్ట్ నుంచి బుట్టబొమ్మ తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'భవదీయుడు భగత్ సింగ్' మూవీలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ విషయాన్ని దర్శకుడు కూడా ధ్రువీకరించారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఎప్పుడు షూట్ కి వెళ్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి హరీష్ రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు కొన్ని కారణాలతో పూజా తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో 'భవదీయుడు భగత్ సింగ్' ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఉండటం.. పూజాకి వేరే పాన్ ఇండియా సినిమాల ఆఫర్స్ వస్తుందటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది. పవన్ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తరువాత తమిళ చిత్రం 'వినోదయ సితం' రీమేక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా వుంది.మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలానే హిందీలో సల్మాన్ ఖాన్ తో కలిసి 'కబీ ఈద్ కబీ దివాలీ' సినిమా చిత్రీకరణలో పాల్గొంటోంది.
ఇదే క్రమంలో ఇప్పుడు కొత్తగా పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రానున్న 'JGM' (జనగణమన) సినిమాలో పూజా నే హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పవన్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డేట్స్ విషయంలో సందిగ్ధత నెలకొనే అవకాశం ఉండటంతో పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికే మొగ్గు చూపిందని టాక్ నడుస్తోంది.
నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమాని పూజా హెగ్డే వదులుకుందా? ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమే కారణమా? ఇందులో అసలు నిజమెంత? అనే దానిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.