పిక్ టాక్‌ : ఈ నడుము అందానికి ఎవరైనా కరిగి పోవాల్సిందే

Update: 2023-05-18 10:59 GMT
ఒక లైలా కోసం.. ముకుంద సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఆ రెండు సినిమాలు కూడా ఆమెకు పెద్దగా సక్సెస్ లను తెచ్చి పెట్టలేక పోయాయి.

అంతే కాకుండా ఆ రెండు సినిమా ల తర్వాత పూర్తిగా బాలీవుడ్‌ కే పూజా పరిమితం అయ్యింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో డీజే సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

ఆ సినిమా లో అందాల ఆరబోత చేసి... ఇంతటి అందం ఇన్నాళ్లు ఎక్కడ ఉంది అన్నట్లుగా ప్రేక్షకులు అనుకునేంత స్కిన్‌ షో చేసింది. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. అందాల ఆరబోత విషయంలో పూజా హెగ్డే అసలు మొహమాట పడకుండా సినిమాలు చేస్తూ ఫోటో షూట్స్ చేస్తూ వచ్చింది.

తాజాగా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి. ఇలా నడుము అందాన్ని చూపిస్తూ ఆకట్టుకునే ఫిజిక్ తో స్కిన్‌ టోన్ తో కన్నులు తిప్పుకోకుండా చేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంత అందం కు ఎవరైనా కరిగి పోవాల్సిందే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ అమ్మడు చాలా నమ్మకం పెట్టుకుని చేసిన కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్ సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ఇక ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న ఏకైక పెద్ద తెలుగు సినిమా మహేష్ బాబు సినిమా అనే విషయం తెల్సిందే.

హీరోయిన్ గా ఈ అమ్మడు మరో అయిదు ఆరు సంవత్సరాల పాటు బిజీగా ఉండాలంటే మహేష్ బాబు తో ప్రస్తుతం చేస్తున్న సినిమా హిట్‌ అవ్వాల్సి ఉంది.

Similar News