బుట్ట బొమ్మ నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్‌

Update: 2021-01-09 10:09 GMT
బాపు శిష్యుడైన త్రివిక్ర‌మ్ పూజాని బుట్ట బొమ్మ‌గా మ‌లిచారు. నిజానికి అల పాత్ర‌లో ఈ ముంబై గాళ్‌ ట్రెండీగా హాట్ గా కనిపిస్తుందే కానీ.. మ‌రీ పాత కాలం ముత్యాల ముగ్గు సంగీతలా.. రాధాగోపాలం స్నేహ‌లా క‌నిపించ‌దు. అయినా కానీ మాంత్రికుడు త్రివిక్ర‌మ్ .. రామ‌జోగయ్య శాస్త్రితో క‌లిసి బుట్ట బొమ్మ అంటూ ఆ సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టు ఎంతో తెలివైన ప‌ద‌జాలాన్ని వినియోగించార‌నే చెప్పాలి.

ఇక రెగ్యులర్ ఫోటోషూట్ల‌లో మాత్రం పూజా చెల‌రేగిపోతోంది. నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో హీటెక్కించే ఫోటోల్ని షేర్ చేస్తోంది ఈ బ్యూటీ. కొద్దిరోజులుగా పూజా హెగ్డే ఇటీవ‌లి ఫోటోషూట్ నుంచి ఓ ఛ‌మ‌క్కు లాంటి ఫోటో అభిమానుల సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది. పూజా లుక్ నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించేంత హాట్ గా ఉండ‌డంతో ఇది వాట్సాపుల్లోనూ జోరుగా వైర‌ల్ అవుతోంది.

పూజా టాప్ టు బాట‌మ్ టోన్డ్ బాడీతో .. ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ .. క‌వ్వించే లుక్ తో మైమ‌రిపించింది. సింపుల్ స్మైల్ తో కిల్లింగ్ చూపుల‌తో క‌వ్వించేస్తోందిలా. ఇక ఆ గ్రీన్ డిజైన‌ర్ బాడీ ఫిట్ డ్రెస్ త‌న అందాల్ని ప‌దింత‌లు ఎలివేట్ చేసింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం పూజా .. టాలీవుడ్ లో ప్ర‌భాస్ తో రాధేశ్యామ్.. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాల్లో న‌టిస్తోంది. అటు బాలీవుడ్ లోనూ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది.
Tags:    

Similar News