ఎప్పుడూ అందంగా ఉండ‌డం చాలా విసుగు!

Update: 2021-08-18 01:30 GMT
ముంబై బ్యూటీ పూజా హెగ్డే ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. తాజాగా పూజా తన అందమైన స్నాప్ ను పంచుకుంది. దీనికి క్యాప్షన్ ఇవ్వమని తన అభిమానులను కోరింది. ఎల్లప్పుడూ అందంగా ఉండటం చాలా విసుగు! అని ఒక‌రు.. ఉదయం నిద్రలేచి అద్దంలోకి చూసుకోవడం (సిక్) లాగా ఉంటుంది అంటూ మరొక అభిమాని వ్యాఖ్య‌ల్ని జోడించారు. ఇంత‌కుముందు సింఘం లుక్ అంటూ రిలీజ్ చేసిన మ‌రో ఫోటో అంతే వైర‌ల్ గా మారింది. వీటికి షెల్డన్ శాంటోస్ ఫోటోగ్రఫీ అందించారు. మీగన్ కన్సెసియో స్టైలింగ్ చేశారు.

`అల వైకుంఠ‌పుర‌ములో` ఘ‌న‌విజ‌యంతో బుట్ట‌బొమ్మగా పూజా క్రేజ్ అమాంతం ఖండాంత‌రాల‌కు విస్త‌రించింది. పూజా హెగ్దే కెరీర్ కి అద‌న‌పు మైలేజ్ ని ఇచ్చిన చిత్ర‌మిది. ప్ర‌స్తుతం పూజా మూడు భాష‌ల్ని బుట్ట‌బొమ్మ చుట్టేస్తోంది. తెలుగు- హిందీ- త‌మిళంలో  అగ్ర హీరోల చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

ప్ర‌భాస్ స‌ర‌స‌న పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` లో న‌టిస్తోంది. ఇది 1970 కాలం నాటి పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ. ఇంకా మ‌రెన్నో మ‌ల్టిపుల్ లేయ‌ర్స్ టెక్నిక్ ఇందులో ఎగ్జ‌యిట్ చేయ‌నున్నాయి. ముఖ్యంగా రాధేశ్యామ్ లో పూజా పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంద‌ని తెలుస్తోంది. పాత్ర స్వ‌భావం కూడా చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని పూజానే రివీల్ చేసింది.

అలాగే మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న `ఆచార్య`లో నీలాంబ‌రి  పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ పాత్ర చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని ఇప్ప‌టికే యూనిట్ లీకులిచ్చింది. `న‌ర‌సింహ`లో ర‌మ్య‌కృష్ణ పాత్ర రేంజులో ఉంటుంద‌న్న ప్ర‌చారం అంతే హీటెక్కిస్తోంది. కొర‌టాల శివ చిత్రాల్లో హీరోయిన్ ల‌ పాత్ర‌కు  ఉండే వెయిట్ గురించి  చెప్పాల్సిన ప‌నిలేదు. అక్కినేని అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలోనూ పూజా కి అద్భుత‌మైన పాత్ర ల‌భించింది. ఇప్ప‌టికే అఖిల్ తో రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు యూత్ లో ఫీవ‌ర్ రాజేశాయి.

త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న `బీస్ట్ `లో  రొమాన్స్ చేస్తోంది. త‌మిళంలో మూగ‌మూడి త‌ర్వాత త‌న‌కు రెండ‌వ చిత్రం కాడం విశేషం. ఆమె కెరీర్ అక్క‌డే ప్రారంభ‌మైనా ఛాన్సులు రాక‌పోవ‌డంతో టాలీవుడ్ వైపు వ‌చ్చేసింది. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు  కోలీవుడ్ లో స్టార్ హీరో విజ‌య్ సినిమాతో కంబ్యాక్ అవుతోంది. ఇక బాలీవుడ్ లో `సిర్క‌స్` లో ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. జాక్వెలీన్ ఫెర్నాండేజ్ ఇందులో మొద‌టి హీరోయిన్ కాగా పూజా  సెకెండ్ లీడ్ లో క‌నిపించ‌నుంది. అలాగే స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్క‌నున్న కొత్త ప్రాజెక్ట్ లోనూ పూజా హెగ్దే హీరోయిన్ గా ఎంపికైంది. ఇక బుట్ట‌బొమ్మ వ‌రుస ఫోటోషూట్లు ఎంతో క్రియేటివ్ గా అల‌రిస్తున్నాయి. ఈ ఫోటోల‌ను అభిమానులు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.
Tags:    

Similar News