వీడియో: క‌న్నుగీటి బుట్ట‌బొమ్మ పూజా ఫ‌న్

Update: 2021-04-06 09:57 GMT
వ‌రుస సినిమాల‌తో ఓ వైపు.. వ‌రుస ఫోటోషూట్లతో మ‌రోవైపు బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఇస్తున్న ట్రీట్ నిరంత‌రం హాట్ టాపిక్. ఈ భామ న‌టించిన ఆచార్య‌.. రాధేశ్యామ్ .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాలు త‌దుప‌రి రిలీజ్ ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ సినిమాల‌కు సంబంధించిన ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాల‌కు పూజా హాజ‌రు కానుంది.

ఈలోగానే అటు బాలీవుడ్ సినిమాల షెడ్యూల్స్ ని మ్యానేజ్ చేస్తూ త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌నా ఓ క్రేజీ చిత్రంలో న‌టించేస్తోంది. మ‌రోవైపు ఫోటోషూట్ల విష‌యంలోనూ ఈ భామ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. తాజాగా ఓ డిజైన‌ర్ షూట్ కి సంబంధించిన‌ వీడియోని పూజా షేర్ చేసింది. ఇందులో ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో పూజా ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది.

అప్పుడే నిదుర లేచిన‌ట్టుగా లేజీగా ఇంట్రో ఇచ్చిన పూజా.. ఆ వెంట‌నే బ్యాక్ లెస్ ఫోజుతో ఛ‌మ‌క్కులా మెరిసింది. అంత‌లోనే వేరొక డిఫ‌రెంట్ స‌మ్మ‌ర్ డిజైన్ తో అల‌రించింది. మూడు వేరియేష‌న్స్ ఉన్న దుస్తుల్లో ఆక‌ట్టుకుంది పూజా. మొత్తానికి వీడియో ని క్రియేటివ్ గా ప్రెజెంట్ చేసారు మేక‌ర్స్. ప్ర‌స్తుతం ఇది అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

Tags:    

Similar News