షూటింగ్ సెట్లో పూజా అల్లరి మాములుగా లేదుగా చూస్తే షాకే!

Update: 2021-03-20 10:14 GMT
సినిమా షూటింగ్స్ సమయంలో హీరోయిన్స్ అల్లరి చేయడం గురించి వింటూ ఉంటాం. హీరోను హీరోయిన్ ఆటపట్టించింది అని.. లేదా హీరోయిన్ను హీరో ఆటపట్టించాడు అని. లేదా ఇద్దరూ కలిసి దర్శకుడిని ఆటపట్టించారు.. ఇలా రకరకాలుగా వింటూనే ఉంటాం. కానీ ఎవరూ బయటపడరు. ప్రతి సినిమా షూటింగ్ లో అందరూ నటినటులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు సరదాగా ఉంటారనేది తెలిసిందే. వారు కూడా షూటింగ్ ముగిసిన తర్వాత రిలీజ్ టైంలో ఇంటర్వ్యూలలో చెప్తుంటారు. అలాంటి కోతిపనులు చేయడంలో హీరోలకంటే హీరోయిన్స్ ముందుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్ చూస్తే అర్ధమవుతుంది. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఎలా అల్లరి చేస్తుందో.

సోషల్ మీడియాలో పూజా ఎంత యాక్టీవ్ గా ఉంటుందో తెలిసిందే. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది మరి. అందుకే వారికోసం అయినా అమ్మడు యాక్టీవ్ గా ఉండకతప్పదు. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పూజా ఓ క్రేజీ పిక్ షేర్ చేసింది. ఆ ఫోటోలో పూజా హీరో అఖిల్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కనిపిస్తున్నారు. కనిపించడం బాగానే ఉంది కానీ పూజా ఏం చేస్తోంది..? అక్కడ డైరెక్టర్ సీన్ చెబుతుంటే అఖిల్ శ్రద్ధగా వినటం మనం చూడవచ్చు. కానీ హీరో వెనక నిలబడిన పూజా ఏం చేస్తుందంటే.. హీరో అఖిల్ కు కొమ్ములు ఉన్నట్లుగా వేళ్ళతో చూపిస్తుంది. కలర్ ఫుల్ పూలపూల స్టైలిష్ డ్రెస్ ధరించిన పూజా.. డైరెక్టర్, హీరోను ఆటపట్టించడం కాస్త సరదాగానే ఉంటుంది. ఆ ఫోటో తన ఫ్యాన్స్ చూడాలని సోషల్ మీడియాలో పెట్టింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమ్మడు బ్యాచిలర్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది.  దీంతోపాటు పలు భారీ సినిమాలలో నటిస్తోంది పూజాహెగ్డే.
Tags:    

Similar News