సినిమాలతో పాటు డిగ్రీలు..డాక్టరేట్లు!
ఒకప్పుడు సినిమా హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయితే చదువు మధ్యలోనే ఆపేసేవారు. నటిగా కెరీర్ ని నిర్దేశించుకుని ముందుకెళ్లేవారు.;
ఒకప్పుడు సినిమా హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయితే చదువు మధ్యలోనే ఆపేసేవారు. నటిగా కెరీర్ ని నిర్దేశించుకుని ముందుకెళ్లేవారు. మరోవైపు యాడ్స్ లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదన. ఇలా డబ్బు చూసిన నటి? చదువుకుని సాధించేది ఏముంటుందిలే అని చదువుకు పుల్ స్టాప్ పెట్టేసేవారు. ఫేం ఉన్నంత కాలం పని చేయడం చరమాంకానికి రాగానే పెళ్లి చేసుకుని స్థిరపడటం ఉండేది. ఆ తర్వాత సినిమాల్లో కంటున్యూ అవ్వడం ? లేదా? అన్నది భర్త చేతుల్లో ఉండేది. చాలా మంది నటీమణులు వివాహం తర్వాత ఇండస్ట్రీలో కొనసాగింది లేదు.
చాలా తక్కువ మందే సెకెండ్ ఇన్నింగ్స్ లో కనిపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాలతో పాటు చదువుకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాలు చేస్తూనే డిగ్రీలు..డాక్టరేట్ లు కూడా అందుకుంటున్నారు. అవసరమైతే కొన్నాళ్ల పాటు సినిమాలకైనా బ్రేక్ ఇస్తున్నారు తప్ప చదవుకు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. సాయిపల్లవి మంచి విద్యావంతురాలు. చదువులో ఎంతో స్పీడ్ గా ఉంటుంది. అమ్మడు జార్జియా లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. సినిమాలు చేస్తూనే మెడికల్ పరీక్షలకు హాజరైంది. ప్రస్తుతం సాయి పల్లవి రిజిస్టర్డ్ డాక్టర్.
సినిమా ఛాన్సులు రాకపోతే హాస్పిటల్ ప్రారంభించి డాక్టర్ గా కొనసాగాలన్నది ఆమె ప్లాన్. అలాగే తెలుగు నటి శ్రీలీల కూడా డాక్టర్ చదువు పూర్తి చేసింది. చదువుతుండగానే సినిమాల్లో అవకాశం రావడంతో వచ్చేసింది. కానీ చదువును మాత్రం వదల్లేదు. సినిమాలు చేస్తూనే డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. శ్రీలీల తల్లి బెంగుళూరులో ఫేమస్ గైనకాలజిస్ట్. అమ్మ తర్వాత డాక్టర్ గా కొనసాగాలన్నది ప్లాన్. చదువు ముఖ్యమా? సినిమాలు ముఖ్యమా? అంటే చదువుకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే కృతి శెట్టికి కూడా చదువు అంటే ఎంతో ఇష్టం.
చిన్న వయసులోనే సినిమా ఛాన్సులు రావడంతో వచ్చేసింది. కానీ డిగ్రీని పూర్తి చేయడం పట్టుదలగా భావించి పూర్తి చేసింది. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా సైకాలజీలో మరో డిగ్రీ పూర్తి చేసే పనిలో ఉంది. రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా సినిమాల్లో నటిస్తూనే విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసింది. బాలీవుడ్ నటి అనన్య పాండే కూడా మంచి విద్యావంతురాలు. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. అలాగే జాన్వీ కపూర్ కూడా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా? చదువుకుంటూనే ఉంది. అమెరికాలోని ప్రసిద్ధ లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సుతో పాటు జనరల్ ఎడ్యుకేషన్‌ను కూడా పూర్తి చేసింది.