• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మణిరత్నం హీరోయిన్ రేంజిలో...

మణిరత్నం హీరోయిన్ రేంజిలో పూజాహెగ్డే.. క్లిక్ అవుతుందా??

By - Tupaki Desk
Update: 2021-05-29 12:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డం అందుకున్న ముంబైభామ పూజాహెగ్డే హవా మాములుగా లేదు. వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోతుంది. 'అరవింద సమేత', మహర్షి లాంటి భారీ విజయాల తర్వాత తన హిట్ల పరంపర కొనసాగిస్తూ గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడు డార్లింగ్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ కరోనా వైరస్ వలన లాక్‌డౌన్‌ పడటంతో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడి.. అమ్మడు స్వీయ నిర్బంధంలో ఉంది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో రాధేశ్యామ్ బ్యూటీ పూజా గురించి ఓ పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ మధ్య రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే క్లాసికల్ డాన్సర్ గా కనిపించనుందని.. త్వరలోనే తన క్లాసికల్ నృత్య కళ మొత్తం సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతోందని టాక్ నడిచింది. అందుకోసం ట్రైనింగ్ కూడా తీసుకుందని వార్తలొచ్చాయి. అయితే వెంటనే ఈ వార్తలపై రాధేశ్యామ్ చిత్ర యూనిట్ స్పందించి.. ప్రభాస్ సరసన నటిస్తున్న పూజా హెగ్డే ఈ సినిమాలో క్లాసికల్ డాన్సర్ కాదని తేల్చి చెప్పడంతో అది అక్కడివరకే ఆగిపోయింది. అయితే తాజాగా పూజా క్యారెక్టర్ ఇంతవరకు లేనివిధంగా చాలా హైలైట్ అవ్వబోతుందని పుకార్లు వైరల్ అవుతున్నాయి.

నిజానికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా ఎంతో ప్రాధాన్యతను కూడి ఉంటాయి. అలాంటి వాటిలో సూపర్ హిట్ గీతాంజలి సినిమాలో చేసిన గిరిజ పోషించిన గీత పాత్ర ఎంత క్రేజీగా పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అదికూడా ఓ ప్రేమకథాచిత్రం కావడం విశేషం. ఆ విధంగానే ఈ పీరియడిక్ లవ్ స్టోరీలో పూజాహెగ్డే పోషించిన ప్రేరణ పాత్ర కూడా అంతే హైలైట్ అవుతుందని అంటున్నాయి సినీవర్గాలు. ప్రభాస్ ఈ సినిమాలో విక్రమాదిత్యగా కనిపించనున్నాడు. ఫస్ట్ టైం పూజా - ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ ప్యూర్ లవ్ స్టోరీ పై ప్రేక్షకులలో అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. 1960-70ల నాటి కథతో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. చూడాలి మరి సినిమా రిలీజ్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో..!
Tags:    
  • Pooja Hegde 
  • radhe shyam Movie 
  • Pooja Hegde Movies 
  • Pooja Hegde Latest Updates 
  • Pooja Hegde New Movies 
  • acharya 
  • pooja bollywood entry 

Similar News

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS