క్రేజీ ప్రాజెక్ట్ లో లక్కీ చాన్స్ కొట్టేసింది
ఒక్కో హీరోయిన్ కు ఒక్కో టైమ్ నడుస్తుంది. ప్రస్తుతం ముద్దుగుమ్మ పూజా హెగ్డే టైమ్ నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా ఈమె పెద్ద హీరోల సరసన నటిస్తూ వస్తోంది. మరో వైపు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వంటి బిగ్గెస్ట్ స్టార్ తో నటించే అవకాశాన్నికూడా దక్కించుకుంది. ఇలాంటి సమయంలో కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడు బిజీ అయ్యింది. ఇప్పటికే విజయ్ నటిస్తున్న ఒక సినిమా లో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. తమిళ సూపర్ స్టార్ సినిమాలో అవకాశం దక్కడంతో ఈ అమ్మడి ఆనందంకు అవధులు లేవనే చెప్పాలి. ఇవి మాత్రమే కాకుండా ఇంకా కూడా ఈమె చేతిలోకి క్రేజీ ప్రాజెక్ట్ లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ముద్దుగుమ్మ పూజా హెగ్డే కు ధనుష్ తో కలిసి నటించే అవకాశం దక్కింది.
విశ్వసనీయంగా అందుతున్న సమచారం ప్రకారం ధనుష్ హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేశారట. తెలుగు మరియు తమిళంలో ఏక కాలంలో రూపొందబోతున్న ఈ సినిమా లో రెండు భాషల్లో కూడా గుర్తింపు ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందనే అభిప్రాయం లో మేకర్స్ ఉన్నారు. అందుకే ఈమెను ఈ సినిమా కోసం ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను కన్ఫర్మ్ చేసిన ధనుష్ తాజాగా మరో సినిమాను కూడా ఈయన తెలుగు లో కన్ఫర్మ్ చేయడం మాత్రమే కాకుండా వెంటనే సినిమా వర్క్ కూడా మొదలు పెట్టించాడు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇప్పటికే తెలుగు లో వచ్చిన సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన నేపథ్యంలో ధనుష్ ఆయన దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అయ్యాడట. అంతే కాకుండా ఆయన చెప్పిన కథకు ధనుష్ వెంటనే కనెక్ట్ అయ్యాడని కూడా మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది వీరిద్దరి కాంబో మూవీ తప్పకుండా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కడంతో ఈ అమ్మడి క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అని.. ఇది ఆమెకు అతి పెద్ద అవకాశంగా... లక్కీ ఛాన్స్ గా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు లో ఈమె నటించిన రాధే శ్యామ్ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆ సినిమా ల తర్వాత వచ్చే ఏడాది ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. ఒకే సారి ఇన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మలు చాలా తక్కువ ఉంటారు. పూజా హెగ్డేకు ఆ అవకాశం దక్కింది. ధనుష్ మరియు పూజా హెగ్డే కాంబో ఎలా ఉంటుందో అంటూ ఇప్పటి నుండే అభిమానులు మరియు మేకర్స్ నెట్టింట చర్చించుకుంటు ఉన్నారు. వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.