సీనియర్ హీరోల బాక్సాఫీస్.. టాప్ ఓపెనింగ్ లెక్కలు ఇవే..

టాలీవుడ్‌లో కుర్ర హీరోల సందడి ఎంత ఉన్నా, బాక్సాఫీస్ దగ్గర అసలైన సౌండ్ మాత్రం 'సీనియర్ స్టార్స్' నుంచే వస్తోంది.;

Update: 2026-01-22 09:30 GMT

టాలీవుడ్‌లో కుర్ర హీరోల సందడి ఎంత ఉన్నా, బాక్సాఫీస్ దగ్గర అసలైన సౌండ్ మాత్రం 'సీనియర్ స్టార్స్' నుంచే వస్తోంది. వయసు పెరుగుతున్నా వసూళ్ల వేటలో తామేం తక్కువ కాదని మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ మరోసారి నిరూపించారు. ముఖ్యంగా డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లలో ఈ సీనియర్లు సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ రాబట్టడంలో వీరి స్టామినా మరో లెవెల్లో ఉంది.

మెగాస్టార్ చిరంజీవి ఈ లిస్టులో టాప్ పొజిషన్లలో ఉంటూ తన బాక్సాఫీస్ ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా మొదటి రోజే ఏకంగా రూ. 84 కోట్ల గ్రాస్ సాధించి చిరు కెరీర్‌లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. పీరియడ్ డ్రామా 'సైరా నరసింహారెడ్డి' సాధించిన రూ. 85 కోట్ల రికార్డుకు ఇది అత్యంత చేరువగా రావడం విశేషం.

ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే, 'అఖండ' నుంచి ఆయన బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. రీసెంట్‌గా వచ్చిన 'డాకు మహారాజ్' మొదటి రోజే రూ. 51.85 కోట్లు కొల్లగొట్టి బాలయ్య మాస్ పవర్‌ను చూపించింది. అలాగే 'వీరసింహారెడ్డి', 'అఖండ 2' సినిమాలు కూడా యాభై కోట్ల మార్కును టచ్ చేస్తూ బాలకృష్ణను ఈ ఎలైట్ లిస్టులో నిలబెట్టాయి. మాస్ ఆడియన్స్‌లో ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ అంకెలే చెబుతున్నాయి.

విక్టరీ వెంకటేష్ కూడా ఈ రేసులో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా మొదటి రోజు రూ. 40.05 కోట్ల గ్రాస్ సాధించి వెంకీ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకున్న గ్రిప్, పండగ సీజన్ అడ్వాంటేజ్ కలిసి ఈ భారీ వసూళ్లను సాధ్యం చేశాయి. సీనియర్ హీరోల్లో వెంకటేష్ సైలెంట్‌గా వచ్చి సాలిడ్ నంబర్స్ సాధిస్తున్నారు.

మొత్తానికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సీనియర్ల హవా ఇప్పట్లో తగ్గేలా లేదు. కంటెంట్ కరెక్ట్‌గా కుదిరితే వీరు సృష్టించే విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ డే 1 కలెక్షన్లు ఒక ఎగ్జాంపుల్. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ, వందల కోట్ల మార్కెట్‌ను శాసిస్తున్న ఈ సీనియర్ల లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు కనుమరుగవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

టోటల్ డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ లిస్ట్

సైరా నరసింహారెడ్డి: రూ. 85 కోట్లు

మన శంకరవరప్రసాద్ గారు: రూ. 84 కోట్లు

ఆచార్య: రూ. 52 కోట్లు

డాకు మహారాజ్: రూ. 51.85 కోట్లు

ఖైదీ నంబర్ 150: రూ. 50.50 కోట్లు

వీరసింహారెడ్డి: రూ. 50.10 కోట్లు

వాల్తేరు వీరయ్య: రూ. 49.10 కోట్లు

అఖండ 2: రూ. 48.85 కోట్లు

సంక్రాంతికి వస్తున్నాం: రూ. 40.05 కోట్లు

Tags:    

Similar News