మొత్తానికి ప్రియుడి గురించి ఓపెన్ అయిన చిట్టి!
ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి గురించి పరిచయం అవసరంలేదు. `జాతిరత్నాలు` విజయంతో అమ్మడు వెలుగు లోకి వచ్చింది.;
ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి గురించి పరిచయం అవసరంలేదు. `జాతిరత్నాలు` విజయంతో అమ్మడు వెలుగు లోకి వచ్చింది. తొలి సినిమాతో మంచి సక్సెస్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. కానీ హీరోయిన్ గా మాత్రం స్థిర పడలేదు. వచ్చిన అవకాశాలు కాదనకుండా పని చేస్తోంది. హీరోయిన్ అవకాశాలతో పాటు స్టార్స్ చిత్రాల్లో కీలక పాత్రలు వచ్చినా నో చెప్పకుండా పని చేయడం అమ్మడి ప్రత్యేకత. సాధారణంగా హీరోయిన్ గా లాంచ్ అయిన వారు కీలక పాత్రలకు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్ని అంత తొందరగా యాక్సప్ట్ చేయరు. కానీ ఫరియా అబ్దుల్లా మాత్రం ఆతరహా లో పనిచేయదు.
నటిగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. మొత్తంగా ఇప్పటి వరకూ ఓ ఎనిమిది సినిమాల వరకూ చేసింది. గత ఏడాది చివర్లో `గుర్రం పాపిరెడ్డి`లో, ఇదే ఏడాది `అనగనగా ఒక రాజు` చిత్రంలో నూ నటించింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన `అనగనగా ఒక రాజు` మాత్రం మంచి విజయం సాధించింది. తొలి సినిమా `జాతిరత్నాలు`ల్లో కూడా నవీన్ కి జోడీగా నటించి విజయం అందుకోవడంతో? ఈ జోడీ సూపర్ అంటూ నెట్టింట కామెంట్లు షురూ అయ్యాయి. అయితే ఈ భామ లవ్ లో ఉన్నట్లు కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది.
వాటి గురించి ఇంత వరకూ ఎక్కడా ఫరియా స్పందించలేదు. తాజాగా ఆ విషయంపై తొలిసారి ఓపెన్ అయింది. తాను ప్రేమలో ఉన్న మాట వాస్తవం అని తెలిపింది. అయితే ప్రియుడు మాత్రం ముస్లీమతానికి చెందిన వాడు కాదని, అతడో హిందు కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలిపింది. బాల్య స్నేహితుడని జరుగుతోన్న ప్రచారాన్ని కూడా ఖండించింది. అతడు సినిమా ఇండస్ట్రీలో ఉంటోన్న కుర్రాడే. కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడంది. కొంత కాలంగా అతడితో కలిసి తాను కూడా పని చేస్తున్నట్లు తెలిపింది. డాన్స్ సహా తనలో వచ్చిన కొన్ని రకాల మార్పులకు ప్రియుడే కారణమంది.
తమ మధ్య ఉన్న బంధం లవ్ ఎఫైర్ కాదని..అదొక అందమైన అనుబంధం అంటూ చెప్పుకొచ్చింది. ఫరియా అబ్దుల్లా పుట్టి పెరగింది హైదరాబాద్ లోనే. లోయో లా అకాడమీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది.సినిమా ల్లోకి రాకముందు థియే టర్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. అమ్మడు మంచి పెయింటర్ కం కవయిత్రి, కూడా . కథక్, హిప్-హాప్ వంటి వివిధ డ్యాన్స్ మంచి ప్రావీణ్యం ఉంది. నటిగా అంతే సహజంగానే పెర్పార్మెన్స్ చేస్తుందనే గుర్తింపు అమ్మడికి ఉంది. మరి తాజా విజయంతో కొత్త ఏడాదిలో ఎలాంటి అవకాశాలు ఒడిసి పట్టుకుంటుందో చూడాలి.