పవన్, సూర్య కాంబో రిపీటవుతుందా?
అయితే పవన్ వీడియోపై అనేక మంది కోలీవుడ్ ప్రముఖులు రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో జయం రవి చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.;
కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్ జే సూర్య తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కు సంబంధించిన స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియో తమిళ వెర్షన్ ను ఆయన పోస్ట్ చేయడంతో ఫుల్ వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ కరాటే ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు ఆయన ఫిట్ నెస్, డిసిప్లైన్ ను మరోసారి బయటపెట్టాయి.
అయితే పవన్ వీడియోపై అనేక మంది కోలీవుడ్ ప్రముఖులు రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో జయం రవి చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. "పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయండి" అంటూ జయం రవి ఎస్ జే సూర్యను ట్యాగ్ చేస్తూ రిక్వెస్ట్ చేయడం అభిమానులను ఒక్కసారిగా ఆకర్షించింది. ఆ కామెంట్ తో పవన్, ఎస్ జే సూర్య కాంబినేషన్‌పై మళ్లీ చర్చ మొదలైంది.
పవన్ కు ఎస్. జె సూర్యతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదే. గతంలో ఖుషి లాంటి సూపర్ హిట్ సినిమా ద్వారా వారి కాంబినేషన్ అందరినీ ఆకట్టుకుంది. తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. ఆ సినిమా అప్పట్లో యూత్ ను బాగా ఆకట్టుకోవడమే కాదు, పవన్ కెరీర్ లో కూడా టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అందుకే మళ్లీ ఆ కాంబో వస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
జయం రవి చేసిన కామెంట్ ను చూసిన పవన్ అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. అది నిజమైతే బాగుంటుందని, మళ్లీ ఖుషి మ్యాజిక్ చూడాలని ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. జయం రవి సరదాగా చేసిన కామెంట్ అయినా… నిజంగా జరిగితే బ్లాక్ బస్టర్ ఖాయమని కామెంట్లు పెడుతున్నారు. దీంతో పవన్, సూర్య కాంబో కోసం అంతా మాట్లాడుకుంటున్నారు.
అయితే సినీ పరిశ్రమలో ఇలాంటి కామెంట్స్ కొన్నిసార్లు రియల్ అవుతాయన్న సంగతి తెలిసిందే. దీంతో జయం రవి చేసిన సరదా రిక్వెస్ట్ కు ఎస్ జే సూర్య ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగానే పవన్ కళ్యాణ్–ఎస్ జే సూర్య మళ్లీ కలిసి పనిచేస్తే.. అది తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఒక పెద్ద ట్రీట్ గా మారడం ఖాయం. అదే జరగాలని ఇప్పుడు అంతా కోరుకుంటున్నారు.
అదే సమయంలో పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తన లైనప్ లోని సినిమాలను కంప్లీట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ తో సందడి చేయనున్నారు. రీసెంట్ గా.. రామ్ తాళ్లూరి నిర్మాణంలో మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత నిర్మాత విశ్వప్రసాద్ తో చర్చలు జరిపారు. ఏదేమైనా ఫ్యూచర్ లో పవన్, ఎస్ జే సూర్య కాంబోలో అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందేమో వేచి చూడాలి.