అనగనగా ఒక రాజు.. హీరోయినే మూవీ రైటర్..

సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన అనగనగా ఒక రాజు మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.;

Update: 2026-01-22 07:42 GMT

సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్స్ లోకి వచ్చిన అనగనగా ఒక రాజు మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. మారి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరీ లీడ్ రోల్స్ లో నటించగా.. యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. భారీ పోటీ ఉన్నా కూడా సినిమాను రిలీజ్ చేయగా.. కంటెంట్ బాగుండడంతో హిట్ ట్రాక్ లో దూసుకుపోతోంది.

ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఆ సినిమా.. రెండు వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. దీంతో సినిమా కోసం ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో చిన్మయి ఘట్రాజు కోసం మాట్లాడుకుంటున్నారు. ఆమె అంత పాపులర్ కాకపోయినా.. మూవీ ప్రమోషన్స్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

సినిమాకు చిన్మయి ఘట్రాజు క్రియేటివ్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. రైటింగ్ లో తన టాలెంట్ ను చూపించి ఫిదా చేశారు. నవీన్ పోలిశెట్టితో పాటు కలిసి చిన్మయి రచన చేయగా.. మేకింగ్ లో చిన్మయి తన ఫుల్ ఎఫర్ట్ ను పెట్టినట్టు క్లియర్ గా తెలుస్తోంది. ఇటు రైటింగ్, అటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పాలి. అయితే ఆమె హీరోయిన్ గానే తన కెరీర్ ను స్టార్ట్ చేశారు.

ప్రవీణ్‌ సత్తార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎల్.బి.డబ్ల్యూలో చిన్మయి హీరోయిన్ గా నటించారు. 2011లో మూవీ రిలీజ్ అవ్వగా.. ఆ సినిమా తర్వాత బి. జయ దర్శకత్వం వహించిన లవ్లీ, నీలకంఠ మూవీ చమ్మక్ చల్లోలో యాక్ట్ చేశారు. కానీ మొదటి నుంచి తనకు దర్శకత్వం మీద మక్కువ ఉండటంతో ఆ రంగంలో పేరు తెచ్చుకోవాలని చిన్మయి నిర్ణయించుకున్నారు.

కొన్నేళ్ళుగా ఆమె ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంతలో నవీన్‌ పోలిశెట్టితో పరిచయం కావడం, ఆయన ఆమె రైటింగ్ స్టైల్ నచ్చడంతో ఇద్దరూ కలిసి అనగనగా ఒక రాజు స్క్రిప్ట్ రాశారు. నిజానికి ఆ సినిమాను మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాల్సింది. కానీ ఆయన తప్పుకోవడంతో నవీన్ రచయితగా బాధ్యతలు చేపట్టి.. చిన్మయితో కలిసి స్క్రిప్ట్ రాసుకున్నారు.

ఇప్పుడు సినిమా మంచి హిట్ కావడంతో చిన్మయి కోసం అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే త్వరలోనే ఆమె డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకు బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ జరుగుతోందని వినికిడి. అదే నిజమైతే.. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత డైరెక్టర్ గా మారిన అరుదైన జాబితాలోకి ఆమె చేరనున్నారు. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News