మారుతి కమ్ బ్యాక్.. అలా చేయాల్సిందేనా?

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి అందరికీ తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా, కో ప్రొడ్యూసర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఈ రోజుల్లో మూవీతో డైరెక్టర్ గా మారారు.;

Update: 2026-01-22 07:13 GMT

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి అందరికీ తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా, కో ప్రొడ్యూసర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఈ రోజుల్లో మూవీతో డైరెక్టర్ గా మారారు. ఆ తర్వాత బస్ స్టాప్ వంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నారు. మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ వంటి పలు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా భారీ విజయాలు అందుకున్నారు మారుతి.

రీసెంట్ గా ది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ అయిన రాజా సాబ్.. మిక్స్ డ్ టాక్ అందుకుంది. విడుదలకు ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఆ మూవీ.. అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ సాధించలేకపోయింది.

దీంతో మారుతి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కెరీర్ లో బడా హీరోతో నటించే ఛాన్స్ అందుకున్నప్పటికీ.. యూజ్ చేసుకోలేకపోయారని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెద్ద హీరోలతో సినిమా చేసి హిట్ కొడితే ఎంత క్రేజ్ వస్తుందో.. రిజల్ట్ తేడా కొడితే అంతకుమించి విమర్శలు వస్తాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది.

ఇప్పుడు మారుతి కూడా భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. సినిమాలో చాలా ఎలిమెంట్స్ పై సరిగ్గా ఫోకస్ చేయలేదని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు మారుతి.. సరైన కమ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంది. కెరీర్ లో ఇప్పటికే పలు సినిమాలతో హిట్స్ అందుకుని ఫేమ్ సంపాదించుకున్న ఆయన.. రాజా సాబ్ విషయంలో ఫెయిల్ అవ్వడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది.

ఇప్పుడు అప్ కమింగ్ మూవీతో అందరినీ మెప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు ఆయనపై రాజా సాబ్ తో పడ్డ మచ్చ కాస్త అయినా పోతుంది. కానీ అందుకు సరైన ప్లానింగ్ అవసరం. రాజా సాబ్ విషయంలో చేసిన తప్పులు మళ్లీ రిపీట్ చేయకూడదు. స్టోరీతోపాటు స్క్రీన్ ప్లే విషయంలో ఫోకస్ పెట్టి రాసుకోవాలి. అప్పుడే కమ్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి.

అదే సమయంలో మారుతి.. వరుణ్ తేజ్ తో వర్క్ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. అయితే మెగాస్టార్ చిరంజీవితో కచ్చితంగా తాను వర్క్ చేస్తానని ఇటీవల మారుతి అనౌన్స్ చేశారు. తాను చిరు అభిమాని అని చెప్పారు. మరి మారుతి నెక్స్ట్ ఎవరితో మూవీ చేయాలనుకున్నా.. ముందు స్క్రిప్ట్ తో వారిని మెప్పించాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News