• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ సమస్య తీరినట్టేనా ?

అఖిల్ సమస్య తీరినట్టేనా ?

By - Tupaki Desk
Update: 2019-08-27 17:30 GMT
స్టార్ హీరో వారసుడిగా బహుశా అఖిల్ పడుతున్న ఇబ్బంది గతంలో ఎవరు పడిన దాఖలాలు కనిపించవు. వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ముచ్చటగా మూడు ఫ్లాపులతో ఇంకా సక్సెస్ బోణీ కొట్టని అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2 తీస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ సినిమా మీదే ఉన్నాయి. రెండు నెలల క్రితమే పూజా కార్యక్రమాలు చేసి షూటింగ్ లో హీరోయిన్ లేని మొదటి షెడ్యూల్ ని ఫినిష్ చేసిన టీమ్ ప్రస్తుతం బ్రేక్ ఇచ్చేసింది. అఖిల్ తాజాగా అన్న నాగ చైతన్య వదిన సమంతాలతో కలిసి హాలిడే కోసం స్పెయిన్ వెళ్ళిపోయాడు.

కారణం ఇప్పుడీ సినిమాకు జోడి దొరక్కపోవడమేనట. వేర్వేరు ఆప్షన్స్ చూసి ఆఖరికి పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్టుగా ఇన్ సైడ్ న్యూస్. అయితే పూజా హెగ్డేకు విపరీతమైన పని ఒత్తిడి ఉంది. ఇప్పటికిప్పుడు డేట్స్ ఇచ్చే పరిస్థితి ఎంత మాత్రం లేదు. దీంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపేసి పూజా  డేట్స్ రాగానే అఖిల్ 4 కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు అయితే అఖిల్ కంటే సీనియర్ అయిన పూజా హెగ్డే ఈ బాబుకి తగ్గ జోడిగా అనిపిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పూజా రెండో సినిమా ఐదేళ్ల క్రితం వచ్చిన ఒక లైలా కోసం. అందులో చైతు సరసన నటించేసింది. అప్పటికి ఇప్పటికి తనలో కొన్ని మార్పులు వచ్చాయి. మహేష్ బన్నీ తారక్ లంటే బాగా సీనియర్ హీరోలు కాబట్టి వాళ్ళ పక్కన ఇబ్బంది లేదు. కానీ పట్టుమని ఐదు సినిమాల వయసు కూడా లేని అఖిల్ పక్కన పూజా హెడ్జ్ సెట్ అవుతుందా లేదా చూడాలి. ఇవన్నీ అధికారికంగా చెప్పినవి కాకపోయినా ఫైనల్ గా అఖిల్ 4 కు బ్రేక్ పడ్డ మాట వాస్తవమే. అది పూజా కోసమా లేక ఇంకేదైనా రీజనా అనేది కొద్దిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది


Tags:    
  • Akhil Akkineni 
  • Pooja Hegde 
  • latest News 
  • Akhil 4 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS