కాస్త ఆలస్యం అయినా అమ్మడికి భలే కలిసి వచ్చిందే
పూజా హెగ్డే కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోక పోవడంతో అమ్మడి కెరీర్ లో నిలదొక్కకోవడం కష్టమే అని అంతా అనుకున్నారు. బాలీవుడ్ లో చేసిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో ఈమె కెరీర్ ఎంత వరకు సాగుతుందో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అలాంటి సమయంలో ఈ అమ్మడు తెలుగు లో డీజేతో రీ ఎంట్రీ ఇచ్చి సెన్షేషనల్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు లో టాప్ స్టార్ హీరోయిన్ గా దూసుకు వచ్చిన ఈ అమ్మడు ఒక్కసారిగా టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు.. చేసిన సినిమాల కారణంగా టాప్ స్టార్ గా నిలిచింది. ఇక తమిళంలో ఈ అమ్మడికి ఆఫర్లు చాలా ఆలస్యంగా వచ్చాయి.
ఒక వైపు తెలుగు లో మరియు హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో కూడా తమిళంలో మాత్రం ఈమెకు ఆఫర్లు రాలేదు. దాంతో ఈమెకు తమిళంపై ఆసక్తి లేదేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని మంచి ఆఫర్ కోసం వెయిట్ చేసిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే మొదటగా తమిళంలో సూపర్ స్టార్ విజయ్ తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. విజయ్ తో ప్రస్తుతం బెస్ట్ లో నటిస్తున్న పూజా హెగ్డేకు మరో బిగ్ ఛాన్స్ దక్కింది. తమిళ స్టార్ హీరో ధనుష్ కు జోడీగా ఈమె ఎంపిక అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అది కూడా తెలుగు మరియు తమిళంలో రూపొందబోతున్న ద్వి భాష పాన్ ఇండియా మూవీలో ఈమెకు ఛాన్స్ దక్కింది.
ధనుష్ హీరోగా తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ఈ సినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ధనుష్ మొదటగా తెలుగు లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక తెలుగు తమిళ ద్విభాష సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమా తో పాటే వెంకీ దర్శకత్వంలో కూడా ధనుష్ చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు లో పెద్దగా మార్కెట్ లేని ధనుష్ ఈ రెండు సినిమాలతో ఇక్కడి హీరోలకు పోటీగా నిలుస్తాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో ధనుష్ కు క్రేజ్ తక్కువ కనుక పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్ ను నటింపజేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే పూజా హెగ్డేకు బ్యాక్ టు బ్యాక్ విజయ్ మరియు ధనుష్ వంటి స్టార్ లతో నటించే అవకాశం దక్కింది.