ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయినుగా మారనున్న జిగేల్ రాణి!!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందాల భామ పూజాహెగ్డే హవా నడుస్తోందని చెప్పాలి. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే తన స్పీడ్ పెంచేసింది. 'అరవింద సమేత', మహర్షిల భారీ విజయాల తర్వాత తన హిట్ల పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్టు తన ఖాతాలో వేసుకుంది. అమ్మడి హవా ప్రస్తుతం ఊపు మీద ఉన్నట్లే అన్పిస్తుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోంది. అంతేగాక అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లో హీరోయినుగా నటిస్తుంది. వీటితో పాటు వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న అమ్మడి కెరీర్ నక్కతోక తొక్కినట్లుగా మారింది. ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
టాలీవుడ్ దర్శక నిర్మాతలే కాదు పూజ మీద కోలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడిందట. ఇటీవలే సల్మాన్ ఖాన్ పక్కన సోలో హీరోయినుగా నటిస్తుందంటే ఆమె రేంజ్ ఏమిటో అర్ధమవుతోంది. సల్మాన్ సరసన సినిమాకు ‘కబీ ఈద్ కబీ దివాలీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'బచ్చన్ పాండి'లో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమాలో కృతిసనన్ మెయిన్ హీరోయినుగా నటిస్తుండగా పూజా సెకండ్ హీరోయినుగా కనిపించనుంది. అయితే సెకండ్ హీరోయిన్ అయినా పూజాతో రెండు మాస్ సాంగ్స్ ఉన్నట్లు సమాచారం. అంటే క్యారెక్టరుతో పాటు సాంగ్స్ కూడా క్లిక్ అయితే అమ్మడికి క్రేజ్ మాములుగా ఉండదని టాక్. ప్రస్తుతం అమ్మడి చేతినిండా మూవీస్ ఉన్నాయి. త్వరలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి పూజా ఎన్ని హిట్లు కొడుతుందో..!