ఫోటో స్టోరీ: 42.. అయినా బెస్ట్ బికినీ షేప్

Update: 2019-10-17 17:30 GMT
బాలీవుడ్ లో ఉన్న లేటు వయసు ఘాటు భామల్లో పూజా బత్రా ఒకరు. ఇంతకీ ఈభామ ఎవరు అంటే 1993 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం సాధించిన భామ.  'సిసింద్రీ' లో క్యామియో చేసింది.. 'గ్రీకువీరుడు' లో కూడా నటించింది.  ఇప్పుడు మాత్రం సినిమాల్లో అవకాశాలు లేవు.  ఈ బ్యూటీ వయసు జస్ట్ 42.   అయితే ఇప్పటికీ బికినీ షేప్ మెయింటెయిన్ చేస్తూ సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉంటుంది

ఈ భామ రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "లాస్ ఏంజెలెస్ లో ఇంకా వేసవి ఉంది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వైట్  కలర్ బికినీ ధరించి పూల్ లో నిలుచుని సూపర్ పోజిచ్చింది.  చెవులకు రెడ్ కలర్ ఇయర్ రింగ్స్.. పెదవులకు రెడ్ కలర్ లిప్ స్టిక్ తో కనిపించింది. తలపై రెండు చేతులు పెట్టుకుని వయ్యారంగా నిలుచుంది.  యోగాను రోజుకు ఎన్నిగంటలు చేస్తోందో తెలియదు కానీ ఒక్క గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేకుండా పర్ఫెక్ట్ బికినీ బాడీతో చూపరులకు మతిపోయేలా చేస్తోంది. అయినా నలభైలలో ఇలా ఉండడం ఎంత కష్టమో ముప్పైలలో.. నలభైలలో ఉండేవారికి తప్పనిసరిగా తెలుస్తుంది.

ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "నువ్వే సమ్మర్ తీసుకొచ్చావా?".. "ఇది బెస్ట్ బెల్లీ".. "సూపర్ హాట్" అంటూ పొగిడారు.  ఒకరు మాత్రం "అండర్ ఆర్మ్స్ ఫోటో షాప్ చేశావా?" అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. గమనించి చూస్తే అది నిజమేననిపిస్తోంది.. ఫోటో షాప్ ఎఫెక్ట్ లాగానే ఉంది. 
Tags:    

Similar News