పోల్ రిపోర్ట్: థియేటర్స్ ఓపెన్ చేస్తే సినిమా చూడటానికి వెళ్లే వారెందరు?
కరోనా మహమ్మారి కారణంగా జనాలు థియేటర్ ఎక్స్పీరియన్స్ కి దూరమయ్యారు. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే కొత్త సినిమా కోసం ఎదురు చూసే సినీ అభిమానులు.. హోమ్ స్క్రీన్ లో ఓటీటీ లో అందుబాటులో ఉన్న సినిమాలతో సరిపెట్టుకున్నారు. అయితే 7 నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సులు త్వరలోనే తెరుచుకోనున్నాయి. సగం సీటింగ్ కెపాసిటీతో అనుమతినిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అక్టోబర్ 15 నుంచి సినిమా థియోటర్లకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే థియేటర్స్ లో కోవిడ్ రూల్స్ పాటించాలని సూచించింది. దీంతో దీనికి తగ్గట్టుగా కొన్ని ప్రాంతాల్లో థియేటర్స్ రెడీ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 16 నుంచే కొన్ని సినిమాలు ప్రదర్శనకు పెడుతున్నట్లు ప్రకటించారు. సినిమాలు విడుదల చేస్తారు సరే.. థియేటర్లకు ప్రేక్షకులు ఏమాత్రం వస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కరోనా రికవరీ రేట్ కి పోటీగా ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని సినిమా చూడటానికి వస్తారా లేదా అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ''థియేటర్స్ ఓపెన్ చేస్తే మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారా?" అని 'తుపాకీ డాట్ కామ్' ఓ పోల్ నిర్వహించింది. దీని ప్రకారం అత్యధిక మంది కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్తామని చెప్పారు. ఈ పోల్ లో 27% మంది థియేటర్ లో చూస్తామని చెప్పగా.. 31% చూడమని చెప్పారు. 36% మంది వ్యాక్సిన్ వచ్చే వరకు థియేటర్స్ కి వెళ్ళమని చెప్పారు. మిగతా వారు ఏమో చెప్పలేమని అన్నారు. మరి థియేటర్లు తెరుచుకున్నాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.