మా కొడుకు మృతి పట్ల ఎవరిపై అనుమానం లేదు!!

Update: 2020-06-17 14:00 GMT
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన దేశవ్యాప్తంగా కలవరం సృష్టించింది. సుశాంత్ సూసైడ్ చేసుకోవడంతో అటు ఉత్తర భారతం.. ఇటు దక్షిణ భారతంలోని సినీ ప్రముఖులంతా నివాళులు అర్పిస్తున్నారు. కానీ ఎంతో ఫ్యూచర్ ఉన్న సుశాంత్ ఇలా చేయడం పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సుశాంత్ మృతికి బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలే కారణమంటూ నెటిజన్లు హల్చల్ చేస్తున్నారు. బాలీవుడ్లో కొన్ని నిర్మాణ సంస్థలు సుశాంత్ ను కావాలని దూరం పెట్టాయని.. అంతేగాక ఇండస్ట్రీలో వారసత్వ రాజకీయాలే ఎక్కువగా ఉన్నాయని వారే సుశాంత్ మృతికి కారణమంటూ మండిపడుతున్నారు. వీటన్నింటి వల్ల సుశాంత్ మానసికంగా చాలా కుంగిపోయాడని అంతా అనుకుంటున్నారు.

అయితే సుశాంత్ మరణం పై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు. అయితే అసలు సుశాంత్ సూసైడ్ కి కారణం ఏమయ్యుంటుందో ఆయన తండ్రిని కలిసి పలు విషయాలు సేకరించాలని పోలీసులు కెకె సింగ్ ని కలిసారట. ఆయన తండ్రి ఇటీవలే మాట్లాడారు. తాజాగా ముంబై పోలీసులు సుశాంత్ తండ్రి కేకే సింగ్‌తో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. "ఇంతవరకు సుశాంత్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు తనకు.. తన కుటుంబానికి తెలియదని ముంబై పోలీసులతో తెలిపారు. అంతేగాక అసలు సుశాంత్ డిప్రెషన్‌కు ఎందుకు గురయ్యాడో కూడా తమకు అర్థం కావడం లేదని అన్నారు. ఇక ప్రస్తుతం మేం సుశాంత్ మరణం విషయంలో ఎవరినీ అనుమానించడం లేదని తెలిపినట్లు సమాచారం. అనంతరం ముంబై పోలీసులు సుశాంత్ మేనేజర్‌ను.. స్నేహితులను.. టీవీ నటుడు మహేష్ శెట్టిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.
Tags:    

Similar News