• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత కోసం పోలీసులొచ్చారు

సమంత కోసం పోలీసులొచ్చారు

By - Tupaki Desk
Update: 2018-02-13 04:27 GMT
ఆకాశంలో మెరిసే తారల్లాంటి నటులు కళ్లముందు నిజంగా కనిపిస్తే అభిమానులు ఉబ్బితబ్బిబ్బయిపోతుంటారు. ఒక్కసారన్నా కళ్లారా చూడాలని.. వీలయితే ఓ ఫొటో సంపాదించాలని తెగ ఆరాట పడిపోతుంటారు. ప్రేక్షకుల్లో విపరీతమైన ఇమేజ్ ఉన్ననటులు బయట కనిపిస్తే ఆ హంగామా మామూలుగా ఉండదు.

సినిమా నటులను సౌత్ లో విపరీతంగా అభిమానిస్తారు. వీరాభిమానానికి పెట్టింది పేరయిన తమిళనాడులో ఇది మరీ ఎక్కువ. వాళ్ల వీరాభిమానం ఏ రేంజిలో ఉంటుందో తెలుగువారింటి కోడలు సమంత తాజాగా అర్ధమైంది. సమంత తెలంగాణాలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోంది. అదే తమిళనాడులో  ఓ జ్యూయలరీ షాపునకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తోంది. తాజాగా కృష్టగిరి పట్టణంలో ఆ సంస్థ బ్రాంచి ఏర్పాటు చేసింది.  దానిని ప్రారంభించేందుకు సమంత వచ్చింది. ఆమెను చూసేందుకు తమిళ తంబీలు భారీ సంఖ్యలో వచ్చేశారు. వచ్చిన వాళ్లంతా సమంతను చూస్తామంటూ ఆమె కారును చుట్టుముట్టేశారు. దీంతో కారు ముందుకు కదిలే వీలే లేకుండా పోయింది. చివరకు పోలీసులు వచ్చి తమ లాఠీ పవర్ ఏంటో చూపిస్తే గానీ కారు ముందుకు కదలలేదు.

సమంత పెళ్లయినా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ సంఘటన నిరూపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం సమంత తమిళంలో విశాల్ తో నటించిన చిత్రం విడుదల కావాల్సి ఉంది. రెమో ఫేం శివ కార్తికేయన్ తరవాత చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది

Full View
Tags:    
  • Police Lathi Charge 
  • Samantha Fans 
  • Krishnagiri 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS