ఏనుగు, కుక్క, నక్క, పిల్లి.. ఫ్లూటో
ఏనుగును పాత్రధారిని చేసి రాజేంద్రుడు-గజేంద్రుడు తెరకెక్కించారు ఎస్.వి.కృష్ణారెడ్డి. ఏనుగు అభినయం పిల్లలతో పాటు పెద్దలకు కూడా బోలెడంత వినోదం పంచింది. ఇప్పటికీ బుల్లితెరపై ఆ చిత్రాన్ని ఎంతో ఇష్టంగా చూస్తారు పిల్లలు. ఏనుగు, కుక్క, నక్క, పిల్లి కాదేదీ సినిమాకనర్హం అన్న చందంగా ఆ రోజుల్లో మూగ ప్రాణుల్ని పాత్రల్ని చేసి సినిమాలు తీసేవారు.
అయితే అలాంటివాటిని చూసే భాగ్యం మనకు ఇటీవలి కాలంలో కలగనేలేదు. పెటా రాకతో అన్నీ అవిసిపోయాయి. సినిమావాళ్లు మూగజీవాలతో పెట్టుకోవడం మానేశారు. దాంతో పిల్లలకు ఎంతో వినోదాన్ని అందించే ఈ జోనర్ దాదాపు అంతమైంది. అయితే అప్పుడప్పుడు గ్రాఫిక్స్‌లో కుక్కల్ని, పక్షుల్ని, ఇతర జంతువుల్ని క్రియేట్ చేసి సినిమాల్లో వదులుతున్నారు. ఇటీవలే రాజేంద్రప్రసాద్ నటించిన ఓ సినిమాలో నిజమైన కుక్కకు ట్రైనింగ్ ఇచ్చి మరీ సినిమా తీశారు. అలాగే అప్పుడప్పుడు కోడిపుంజుల పందేలు ఒరిజినల్‌గా చూపిస్తున్నారు. కోళ్లను కూడా హింసించకూడదు కాబట్టి చాలా సందర్భాల్లో వాటిని కూడా గ్రాఫిక్స్‌లోనే క్రియేట్ చేసేస్తున్నారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తోందంటే ప్రస్తుతం బాలీవుడ్‌లో జోయా అక్తర్ దర్శకత్వం వహించిన దిల్ దడ్కనే దో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో 'ఫ్లూటో' అనే ఓ కుక్క పాత్రధారి ఉంది. దానికి అమీర్‌ఖాన్ చేత డబ్బింగ్ కూడా చెప్పించారు. ఆ కుక్క అభినయం సినిమాకే హైలైట్‌గా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా ఈ పాత్ర ఓ రివల్యూషన్ తెస్తుందని బాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.