• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: మహిళల...

ట్రైలర్ టాక్: మహిళల సమస్యలను బోల్డ్ గా చర్చిస్తున్న 'పిట్టకథలు'

By - Tupaki Desk
Update: 2021-02-05 05:07 GMT
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ మొట్ట మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ "పిట్టకథలు'' రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆధునిక స్వతంత్ర్య భావాలు కలిగిన మహిళల గురించి నలుగురు దర్శకులు కలిసి ఈ కథా సంకలనాన్ని రూపొందించారు. టాలెంటెడ్ డైరెక్టర్స్ నాగ్‌ అశ్విన్‌ -  బి.వి.నందిని రెడ్డి - తరుణ్ భాస్కర్‌ - సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ఈషా రెబ్బా - సాన్వే మేఘన - అమలా పాల్‌ - శృతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ ఈ తెలుగు ఆంథాలజీని అధికారికంగా ప్రకటించి టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 19న 'పిట్టకథలు' విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఆంథాలజీ ట్రైలర్ ని వదిలారు.

శాన్వీ మేఘన ప్రధాన పాత్రలో నటించిన 'రాముల' అనే కథకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. జగపతిబాబు - అమలా పాల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మీరా' స్టోరీని నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. శృతి హాసన్ లీడ్ రోల్ లో రూపొందిన 'ఎక్స్ లైఫ్' కథకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈషా రెబ్బా - సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పింకీ' విభాగానికి సంజల్ప్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 'పిట్ట కథలు' ట్రైలర్ చూస్తుంటే ఈ సిరీస్ లో మహిళలకు సంబంధించిన అన్ని అంశాలు బోల్డ్ గా చర్చించినట్లు అర్థం అవుతోంది.

భిన్నమైన సంస్కృతుల్ని ఆవిష్కరిస్తూ తీసిన ఈ సినిమాలో మహిళా సాధికారతను, వారు ఎదుర్కొనే సమస్యల్ని చూపించబోతున్నారు. మానవ సంబంధాల్ని సహజంగా కొత్త కోణంలో చూపిస్తున్న 'పిట్ట కథలు' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇది హిందీ 'లస్ట్ స్టోరీస్' తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఆంథాలజీలో మంచు లక్ష్మి - అషిమా నర్వాల్‌ - సత్యదేవ్‌ - సంజిత్‌ హెగ్దే ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆర్.ఎస్.వి.పి మూవీస్ మరియు ఫ్లయింగ్‌ యునికార్న్‌ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రోనీ స్క్రూవాలా - ఆశిదువా ఈ సిరీస్ ని నిర్మించారు. 'పిట్టకథలు' సంకలనం 190 దేశాలలో ఫిబవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ ప్లిక్స్‌ ప్రకటించింది.

Full View

Tags:    
  • Pitta Kathalu Trailer 
  • Pitta Kathalu Movie Trailer 
  • Shruti Haasan 
  • Eesha Rebba 
  • Amala Paul 
  • Saanve Megghana 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS