పిక్‌ టాక్ః కొత్త ఇంటి కోసం విరుష్క ఆతృత

Update: 2021-01-01 09:30 GMT
స్టార్‌ కపుల్‌ విరుష్క మరి కొన్ని రోజుల్లోనే తల్లిదండ్రులు అవ్వబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరు కూడా ప్రస్తుతం తమకు కలుగబోతున్న సంతానం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతే ఆతృతగా తాము సొంతంగా కట్టించుకుంటున్న జుహులోని ఇంటిపై కూడా ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు ఆసుపత్రి కి అనుష్క ఆరోగ్యం విషయమై చెకప్‌ కు వెళ్లారు. ఆసుపత్రి నుండి నేరుగా విరుష్క దంపతులు జుహుకు వెళ్లి అక్కడ ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

ఇద్దరు కూడా జుహులో తమ అభిరుచికి తగ్గట్లుగా అద్బుతమైన కలల సౌదంను నిర్మిస్తున్నారు. తమకు పుట్టబోతున్న పాపాయి నేరుగా ఆఇంట్లోకి అడుగు పెట్టాలని విరుష్క దంపతులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ దంపతులు వెళ్లారట. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రస్తుతం ఇంటీరియర్‌ డిజైన్‌ వర్క్‌ ను చేయిస్తున్నారట. నాలుగు వారాల్లో పనులు మొత్తం పూర్తి అవుతాయని సమాచారం అందుతోంది. ఈ లోపు వర్క్‌ పూర్తి చేయాలని విరుష్క దంపతులు కోరినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News