ఫొటోటాక్‌ః రౌడీ 'లైగర్‌' అంచనాలు పెంచే క్లిక్‌

Update: 2021-03-29 00:30 GMT
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్‌ సినిమా పై తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే కరణ్‌ జోహార్ ఈ సినిమా కు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న కారణంగా కూడా సినిమా పై బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ ఫొటోను చూస్తుంటే సినిమా పై మరింతగా జనాల్లో ఆసక్తి రేకెత్తుతోందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

లైగర్‌ దర్శకుడు పూరి మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మిలు కలిసి ప్రభుదేవాతో తీసుకున్న ఈ ఫొటో హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుదేవా లుక్‌ చూస్తుంటే ఇది ఖచ్చితంగా లైగర్‌ లో నటిస్తున్నట్లుగా అనిపిస్తుందని అంటున్నారు. ఒక వేళ లైగర్ లో ప్రభుదేవా కనుక ఉంటే కచ్చితంగా సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చిత్రీకరణ ముంబయిలో జరుగుతుంది. ఈ సమయంలో ప్రభుదేవా చిత్ర యూనిట్‌ తో కలిసి ఫొటో దిగడం వల్ల ప్రతి ఒక్కరు కూడా లైగర్ లో ప్రభుదేవా ఉన్నాడేమో అనుకుంటున్నారు. ఈ ఫొటో లైగర్‌ ను మరోసారి చర్చనీయాంశం చేసింది. అసలు విషయం ఏంటీ అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News