ఫోటో స్టోరి: ఊర్వ‌శి మెరుపులు ఉరుములు

Update: 2021-02-07 11:30 GMT
ఊర్వ‌శి రౌతేలా మెరుపులు ఉరుముల గురించి ఇప్పుడే ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇన్ స్టా మాధ్య‌మంలో ఈ అమ్మ‌డి నిరంత‌ర ఫోటో ట్రీట్ ని యూత్ మ‌ర్చిపోలేదు. మాల్దీవుల్లో బికినీ ట్రీట్ ఇచ్చినా.. ముంబై లో ర్యాంప్ వాక్ తో గుబులు రేపినా.. జిమ్ యోగా అంటూ వేడెక్కించే ఫోటోలు వీడియోల్ని షేర్‌ చేసినా ఊర్వ‌శికి ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది కానీ త‌గ్గ‌డం లేదు.

త్వ‌ర‌లోనే ఈ భామ టాలీవుడ్ లోనూ అడుగు పెట్టేస్తోంది కాబ‌ట్టి అస‌లే త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే ఇక్క‌డ స్టార్ హీరోయిన్ల‌కు ఈ అమ్మ‌డి నుంచి సెగ త‌గులుతోంది. ఐటెమ్ నంబ‌ర్ అయినా.. ఫుల్ లెంగ్త్ రోల్ అయినా ఊర్వ‌శి నేను రెడీ అంటోంది.

హేట్ స్టోరి.. గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ చిత్రాల‌తో ఊర్వ‌శి మంట‌లు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో న‌టిస్తూనే టాలీవుడ్ వైపు చూస్తోంది. టాలీవుడ్ లో  ఓ యువ‌త‌రం స్టార్ స‌ర‌స‌నా ఓ మూవీ చేస్తోంది. బ్లాక్ రోజ్ అనే టైటిల్ తో తెలుగులో సినిమా తెర‌కెక్కుతోంది. ర‌ణ‌దీప్ హుడా స‌ర‌స‌న ఇన్ స్పెక్ట‌ర్ అవినాష్ లో న‌టిస్తూ బిజీగా ఉంది.

తాజాగా ఇన్ స్టాలో మ‌రో వేడెక్కించే ఫోటోని ఊర్వ‌శి షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. అదిరిపోయే బ్లూ థై స్లిట్ మాక్సి దుస్తుల్లో మిల్కీ అందాల్ని ఎలివేట్ చేసింది ఊర్వ‌శి. ఇక ఆ వీపందం ఆవిష్క‌ర‌ణ‌లోనూ ఈ భామ ప్ర‌త్యేక‌త ఏమిటో ఈ ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతుంది. యూత్ సోష‌ల్ మీడియాల్లో ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News