• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: 60 ప్ల‌స్ లో...

ఫోటో స్టోరి: 60 ప్ల‌స్ లో మెగా ఛాలెంజ్

By - Tupaki Desk
Update: 2019-11-08 15:58 GMT
నాలుగు ప‌దుల వ‌య‌సు కే జిమ్ముల్లో క‌ఠిన వ్యాయామం అంటే బ‌హు దూరం అంటూ లేజీ గా ఉండేవాళ్లు ఉన్నారు. అయితే 60 ప్ల‌స్ లోనూ మెగా బాస్ హార్డ్ వ‌ర్క్ స‌ర్ ప్రైజ్ ఇస్తోంది. వ‌య‌సు తో ప‌నేం ఉంది మ‌న‌సుండా లే  కానీ! బాస్ వ‌ర్క‌వుట్ చూస్తుంటే.. ఇది మెగా ఛాలెంజ్ అని అనాలా లేక మెగా త‌ప‌స్సు అనాలా ?

అలుప‌న్న‌దే లేకుండా నిరంత‌ర శ్రామికుడి లా త‌పించాలి అన్న‌ది చిరు  త‌త్వం. ఈ వ‌య‌సులోనూ ఆయ‌న సూప‌ర్ స్టార్ గా కంబ్యాక్ అయిన తీరు.. ఖైదీనంబ‌ర్  150 తో ఒక డెబ్యూ  హీరోలా హార్డ్ వ‌ర్క్ చేసిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ద‌ర్శ‌క‌ర‌త్న కీ.శే డా. దాస‌రి  నారాయ‌ణ‌రావు అంత‌టి వారే షాక్  తిన్నాన‌ని అన్నారు. ఇప్ప‌టికే 64 వ‌య‌సు.. అయినా ఆయ‌న ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. జిమ్ముల్లో నిరంత‌రం శ్ర‌మిస్తూనే ఉన్నారు. కంబ్యాక్ లోనూ కుర్ర హీరోల‌కు ధీటుగా పోటీనిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటాడుతున్నారు. ఖైదీ నంబ‌ర్ 150తో నాన్ బాహుబ‌లి రికార్డుల్ని వేటాడారంటే మెగా స్టార్ స్టామినా ఎంతో అంద‌రికీ మ‌రోసారి అర్థ‌మైంది. సైరా-న‌ర‌సింహా రెడ్డి లో ఒక వారియ‌ర్ కింగ్ పాత్ర‌లో అద‌ర‌గొట్టారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి పాత్ర కోసం మెగా స్టార్ ఎంత‌గా శ్ర‌మించారో తెర‌పై చూస్తే అర్థ‌మైంది. ఆ రూపం కోసం జిమ్ముల్లో క‌ఠిన వ్యాయామం చేశారు చిరు.

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం లో సోషియో పొలిటిక‌ల్ డ్రామా లో న‌టించేందుకు రెడీ అవుతున్నారు. మెగా స్టార్ 152 గా చెబుతున్న ఈ సినిమా లోనూ స్మార్ట్ లుక్ తో క‌నిపించ‌నున్నారు. అందుకే ఈ హార్డ్ వ‌ర్క్. ప్ర‌త్యేకించి సెల‌బ్రిటీ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో ఇలా బైసెప్.. ట్రైసెప్ అంటూ జిమ్ లో కుస్తీలు ప‌డుతున్నారు. స్టార్ డ‌మ్ ని నిల‌బెట్టుకోవాలంటే రూపం మ‌న కంట్రోల్ లో ఉండాలి. అందుకే ఇంత క‌ఠినంగా వ్యాయామం చేస్తున్నారు చిరు. ఈ యాటిట్యూడ్.. త‌ప‌న వ‌ల్ల‌నే.. ఆయ‌న‌ ఇండ‌స్ట్రీని మెగా బాస్ గా ఏల్తున్నారు.
Tags:    
  • Mega Star Chiranjeevi 
  • Chiru 152 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Koratala Shiva 
  • Ram Charan 
  • Tollywood Movie News 
  • Tupaki News 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS