ఫోటో స్టోరీ: పూర్తిగా పాప్ సింగర్ గా మారిందే!

Update: 2019-12-02 10:34 GMT
అందరూ హీరోయిన్ల రాగం తాళం వేరు.. శృతి హాసన్ రాగం తాళం వేరు.  అది ఎప్పుడో అందరికీ అర్థం అయింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే 'లవ్' అనడం..  శృతి పాప లండన్ లో పాప్ సింగర్ కెరీర్ పై ఫోకస్ చేయడంతో సినిమాలు అటకెక్కాయి.  సీన్ కట్ చేస్తే మైఖేల్ కోర్సలేతో బ్రేకప్ అయిపోయింది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. అయితే సింగింగ్ కెరీర్ మాత్రం విడిచిపెట్టలేదు.

తాజాగా శృతి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "ఈరోజు రాత్రి ఈజ్లింగ్ టన్ లోని మేడిసన్ లో ప్రోగ్రాం ఉంది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  అర్థం అయింది కదా శృతి తన ఆంగ్ల గాన మాధుర్యాన్ని అక్కడ ఉన్న శ్రోతలకు పంచడానికి రెడీ అవుతోంది.   ఇక ఫోటో విషయానికి వస్తే అచ్చమైన పాప్ సింగర్ తరహాలో తయారైంది..  బ్లాక్ నెట్టెడ్ టాప్.. బ్లాక్ మిడ్డీ ధరించింది.  థీమ్ అంతా బ్లాక్ అనుకుందేమో కానీ లిప్ స్టిక్ తప్ప అంతా నలుపుమయం చేసింది.  షూ నలుపు రంగు.. నెయిల్ పాలిష్ నలుపు రంగు..  జుట్టు కూడా జెట్ బ్లాక్.  ఇక ఈ డ్రెస్ హాట్ గానే ఉంది కానీ రెగ్యులర్ స్టైల్ డ్రెస్ కాదు కాబట్టి అందరికీ నచ్చే అవకాశం లేదు.

ఈ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "పాప్ సింగర్ లాగా ఉన్నావు".. 'అమేజింగ్ డ్రెస్"..  "నీ మేకప్ బాగాలేదు" అంటూ కొందరు నెటిజన్లు స్పందించారు.  సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'లాబం'.. హిందీలో 'పవర్' సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో రవితేజ - గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News