ఆసుపత్రిలో చేరిన ప్రముఖ డైరెక్టర్.. పరిస్థితి విషమం!

Update: 2021-03-13 05:41 GMT
జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడు ఎస్పీ జననాథన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పలు సూపర్ హిట్ సినిమాలను తమిళ ఇండస్ట్రీకి అందించిన జననాథన్ ఆసుపత్రిలో చేరేసరికి కోలీవుడ్ జనాలలో టెన్షన్ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం.. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్ తన గదిలో అపస్మారక స్థితిలో పడిఉండటం గుర్తించి వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం జననాథన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మార్చి 11న అంటే నిన్న సాయంత్రం 4 గంటలకు జరిగింది. ఎస్పీ జననాథన్ తన గదిలో విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ నటించిన తన రాబోయే చిత్రం లాభమ్ ఎడిటింగ్ పర్యవేక్షిస్తూ.. మధ్యలో భోజనం చేయడానికి వెళ్లి స్టూడియోకు తిరిగి రాలేదని నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుతం జననాథన్(61) పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అలాగే ఆయన మెదడులో బ్లడ్ క్లాట్ అవ్వడంతో అలా అపస్మారక స్థితికి గురైనట్లు వైద్యులు తెలిపినట్లు జననాథన్ సోదరుడు అలఘన్ తమిళ్మని తెలిపారు. ప్రస్తుతం తదుపరి చికిత్స గురించి న్యూరో సర్జన్ కోసం వెయిట్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా.. జననాథన్ 2003లో అయ్యార్కై అనే సినిమాతో దర్శకుడుగా కెరీర్ ప్రారంభించారు. మొదటి సినిమానే భారీ విజయం అందుకొని నేషనల్ అవార్డు తీసుకొచ్చింది. ఆ తర్వాత జననాథన్ ఇ, పురంబోక్కు ఎన్నం పోతు ఉదైమై, పెరాన్మై వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన కొన్ని చిత్రాలను తెరకెక్కించారు. జననాథన్ ఎక్కువగా సామాజిక సమస్యలను ప్రస్తావించి పరిష్కరించే సినిమాలు తీసేందుకు ఇష్టపడతారు. ఇటీవలే లాభమ్ మూవీ టీజర్ విడుదలై మంచి బజ్ క్రియేట్ చేసింది.
Tags:    

Similar News