వావ్!! చిన్న సినిమాకి పెద్ద పోస్టర్

Update: 2016-09-30 17:30 GMT
చిన్న సినిమాగా రూపొంది.. అసలు విడుదలవుతుందో లేదో అనిపించుకుని.. చివరకు ఓ బడా నిర్మాత అండ సంపాదించి.. థియేటర్లలోకి వచ్చిన మూవీ పెళ్లి చూపులు. కంటెంట్ నుంచి కామెడీ వరకూ.. హీరో హీరోయిన్స్ నుంచి కమెడియన్ వరకూ.. ప్రతీ ఒక్కళ్లూ ఆకట్టుకోవడం ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. క్రమేపీ థియేటర్లను పెంచుకుంటూ.. అనూహ్యమైన వసూళ్లను సాధించింది.

ఓవర్సీస్ లో అయితే.. ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినంతవరకూ ఇదే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అంటున్నారు. అతి తక్కువ మొత్తానికి రైట్స్ దక్కించుకున్న సినిమా.. మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించడం చిన్న విషయం కాదు. ఇప్పుడీ సినిమా 10వ వారం పోస్టర్ పడింది. అంతే కాదు.. టువార్డ్స్ 100 డేస్ అనే పోస్టర్ ని ధైర్యంగా వేసింది యూనిట్. పెద్ద సినిమాలే మూడో వారం థియేటర్లలోంచి లేచిపోతున్న రోజుల్లో.. 10 వారం నడుస్తూ.. 100 రోజుల పోస్టర్ పడ్డం.. ఈ చిన్న సినిమా సాధించిన అతి పెద్ద విజయంగా చెప్పాలి.

ఇప్పటికే యూఎస్ లో 50 రోజుల పాటు రికార్డ్ సృష్టించిన ఈ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా శతదినోత్సవం జరుపుకోనుండడం.. టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి అద్దం పడుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News