• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లిచూపులు.. కొత్త...

పెళ్లిచూపులు.. కొత్త ట్రైలర్ వచ్చింది

By - Tupaki Desk
Update: 2017-01-09 08:39 GMT
ఐదారు నెలల కిందటే రిలీజై అదిరిపోయే వసూళ్లు సాధించి.. టాలీవుడ్ ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన ‘పెళ్లిచూపులు’ సినిమాకు ఇప్పుడు కొత్తగా ట్రైలర్ రిలీజ్ చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఇది తెలుగు వెర్షన్ కు సంబంధించి కాదులెండి. ఈ చిత్రం ఇప్పుడు మలయాళంలోకి వెళ్తోంది. ‘ఒరు పెన్ కానల్ కథ’ పేరుతో ‘పెళ్లిచూపులు’ చిత్రాన్ని మలయాళంలోకి అనువాదం చేశారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు ట్రైలర్ లాంచ్ చేశారు. తెలుగులో ‘పెళ్లిచూపులు’ కోసం తయారు చేసిన ట్రైలర్నే మలయాళంలోకి తర్జుమా చేశారు. అక్కడి జనాల్ని ఈ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటున్నట్లుగా ఉంది.

సునీల్.ఎ.కె. ఈ చిత్రాన్ని మలయాళ ప్రేక్షకులకు అందిస్తున్నాడు. మలయాళంలో ‘పెళ్లిచూపులు’ తరహా న్యూ వేవ్ సినిమాలు గత కొన్నేళ్లలో మంచి విజయం సాధిస్తున్నాయి. అర్బన్ బేస్డ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు అక్కడ అదరగొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని మలయాళంలోకి అనువాదం చేశారు. మరోవైపు పెళ్లిచూపులు తమిళ రీమేక్ కోసం గౌతమ్ మీనన్ సన్నాహాలు మొదలుపెట్టేశాడు. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది. గౌతమ్ శిష్యుడు సెంథిల్ వీరాస్వామి దర్శకత్వం వహిస్తాడు.  హీరో సంగతి తేలాల్సి ఉంది. హిందీలో ప్రముఖ నిర్మాత వశు భగ్నాని ఈ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Pelli Choopulu 
  • Pelli Choopulu Malayalam version Trailer 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS