ప్రభాస్ తో ఒక్కసారైనా.. అంటున్న హీరోయిన్

Update: 2018-07-06 11:13 GMT
‘ఆర్ఎక్స్ 100’ అనే కొత్త చిత్రం ఈనెల 12న విడుదల కాబోతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పలు సంచలన విషయాలు పంచుకున్నారు.

పాయల్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఆర్ ఎక్స్ 100 నా తొలి సినిమా.. మొదట్లో తెలుగు రాకపోయేసరికి ఎలా నటించాలనే టెన్షన్ ఉండేది. కానీ సెట్ లోకి అడుగుపెట్టాక డైరెక్షన్ టీం - ఇతర సభ్యుల సహకారంతో కష్టమనిపించలేదు. రాంగోపాల్ వర్మ శిష్యుడైన దర్శకుడు అజయ్ భూపతి ఏదీ చెప్తే అది చేశా.. ఆయనకు సీన్లపై చక్కటి క్లారిటీ ఉంది. ఇప్పటివరకూ నేను పనిచేసిన దర్శకుల్లో ఆయనే బెస్ట్ ’ అంటూ దర్శకుడి ప్రతిభను మెచ్చుకుంది..

ఇక తాజాగా విడుదల చేసిన ఆర్ ఎక్స్ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోందని పాయల్ తెలిపారు. ‘స్క్రిప్ట్   కోసమే పలు రోమాంటిక్ లిప్ లాక్ సీన్లలో నటించాను. అలా చేయడం తప్పనిపించలేదు. నటిగా చేస్తున్నాక తప్పదు. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు నటించిన సినిమాలు చూశాను. నాకు బాహుబలి ప్రభాస్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్ లో ఆయన పక్కన ఒక్క సినిమాలోనైనా నటిస్తాననే నమ్మకం ఉంది’ అని ప్రభాస్ పై అభిమానాన్ని చాటుకుంది హీరోయిన్ పాయల్.
Tags:    

Similar News