ఇలా వ‌చ్చి అలా వెళుతున్న హాట్ భామ‌లు‌

Update: 2020-07-29 10:10 GMT
టాలీవుడ్ లోకి ఎంద‌రో క‌థానాయిక‌లు వ‌స్తున్నారు.. వెళుతున్నారు. అందులో ఒక్కొక్క‌రిది ఒక్కో గేమ్. కొంద‌రు క‌నీసం నాలుగైదేళ్ల పాటు అయినా కెరీర్ బండిని స‌జావుగా న‌డిపిస్తుంటారు. కానీ చాలా మంది ఇలా వ‌చ్చి అలా వెళ్లే వారి జాబితాలోనే చేరుతున్నారు. ముంబై - పూణే- దిల్లీ- బెంగ‌ళూరు- మంగుళూరు‌ నుంచి వ‌చ్చిన క్యాట్ వాక్ భామ‌లు నిరూపించుకోలేక అదృష్టం క‌లిసి రాక ఉస్సుర‌ని వెళుతున్నారు.

ఇలా వచ్చి అలా వెళ్లిపోయే హీరోయిన్స్ లిస్ట్ లో తాజాగా నందిత శ్వేత.. పాయల్ రాజ్ పుత్‌ చేరిపోయారు. ఇప్పుడు వీరిద్దరికి ఆఫర్స్ లేక ఖాళీ అయిపోయారు. ఇటీవ‌ల‌ విమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు.  ఎప్పుడో వయసు మీద పడ్డాక చేయాల్సిన సినిమాలు చేసారు. కానీ వీటివ‌ల్ల కెరీర్ కి మేలు జ‌రిగిందేమీ లేదు. పైగా గ్లామ‌ర‌స్ నాయిక‌లుగా చేయాల్సిన ఆఫ‌ర్లు కూడా మిస్స‌వుతున్నాయ్.

ఆర్.ఎక్స్ 100 త‌ర్వాత టూమ‌చ్ అనిపించే బోల్డ్ రోల్స్ ఎంపిక చేసుకుని త‌ప్పు చేసింది పాయ‌ల్. అటుపై వెంకీ మామ లాంటి పెద్ద సినిమా చేసినా కెరీర్ కి క‌లిసి రాలేదు. న‌టిగా ఏమాత్రం ఎద‌గ‌లేదు. ఈ అమ్మ‌డికి ఇటీవ‌ల‌ స‌రైన ఆఫ‌ర్లు ఏవీ లేవు. నందిత శ్వేత చిన్నా చిత‌కా అవ‌కాశాల్ని వ‌దిలి పెట్ట‌క‌పోవ‌డంతో వాటి వ‌ల్ల టోట‌ల్ గా డ్యామేజ్ జ‌రిగింది. నిఖిల్ స‌ర‌స‌న న‌టించిన `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా?` మిన‌హా ఏ సినిమా స‌రైన విజ‌యాన్ని దక్కించుకోలేదు. దాంతో రావాల్సినంత‌ గుర్తింపు రా‌లేదు. పైగా బీగ్రేడ్ సినిమాలు చేసిందంటూ కొట్టిపారేశారు. అటు త‌మిళంలోనూ పెద్ద‌గా సినిమాలేవీ లేవ్ నందిత‌కు. ప్ర‌స్తుతం క‌బ‌డ‌దారి అనే ఒకే ఒక్క సినిమా చేస్తోంది. కార‌ణం ఏదైనా ఇలా వ‌చ్చి అలా వెళ్లే నాయిక‌ల జాబితాలో ఆ ఇద్ద‌రి పేర్లు చేరిపోయాయి.
Tags:    

Similar News