హీరోలకు ధీటుగా పేమెంట్ చెల్లిస్తేనే
క్రేజు ఉన్నప్పుడే దండుకోవాలి. రంగుల ప్రపంచంలో ఈ ఫార్ములా చాలా కాలంగా ఉన్నదే. నేటితరం కథానాయికలు ఈ సూత్రాన్ని ఇట్టే వంట పట్టించుకుంటున్నారు. ఇప్పుడున్న క్రేజీ టాలీవుడ్ హీరోయిన్లలో సమంత- రష్మిక మందన- పూజా హెగ్డే .. ఈ ముగ్గురి పారితోషికాలు స్కైని టచ్ చేస్తున్నాయని సమాచారం.
సమంత ఫ్యామిలీమ్యాన్ 2 సిరీస్ లో నటించిన తర్వాత తన రేంజును మరో లెవల్ కి తీసుకెళ్లారు. ఇప్పటికిప్పుడు వరుస చిత్రాలు వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్న సామ్ పారితోషికంలో రాజీ అన్నదే లేదని చెబుతున్నారట. కాస్త పెద్ద మొత్తమే డిమాండ్ చేస్తున్నారనేది గుసగుస.
అలాగే వరుస సక్సెస్ లతో దూకుడుమీదున్న రష్మిక మందన పుష్ప సహా అటు బాలీవుడ్ లో మూడు చిత్రాల్లో నటిస్తోంది. ప్రాజెక్ట్ ఏదైనా కానీ పారితోషికం విషయంలో అస్సలు తగ్గడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అడగాల్సినదంతా నిర్మొహమాటంగా అడిగి మరీ వసూలు చేసేస్తోందిట రష్మిక.
అలాగే పూజా హెగ్డే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో చిత్రంలో నటించాక పారితోషికంలో ఎక్కడా తగ్గడం లేదు. తదుపరి రాధేశ్యామ్ -ఆచార్య- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి భారీ చిత్రాలు రిలీజ్ బరిలో ఉన్నాయి. బాలీవుడ్ లోనూ కెరీర్ పరంగా బిజీ . ఇటు తెలుగులో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన ఆఫర్ ను తిరస్కరించారని కథనాలొస్తున్నాయి. వేతనం విషయంలో రాజీకి రాకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. మొత్తానికి ఈ భామలెవరూ పారితోషికంలో తగ్గరు... కావాలంటే ఛాన్స్ వదులుకుంటారు కానీ..! హీరోలకు ధీటుగా పేమెంట్ చెల్లిస్తేనే సినిమాలకు సంతకాలు చేస్తున్నారు.