పవన్ పాలిటిక్స్ vs ఓకే ఒక్క సినిమా!

Update: 2022-11-14 00:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో చాలా బిజీగా కొనసాగుతూ మరొకవైపు ముందుగా ఒప్పుకున్న సినిమాల షూటింగ్లను పూర్తి చేయాలని అనుకున్నాడు. అసలైతే మొదట సినిమాల వైపు వెళ్ళకూడదు అనుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో ఓటమిపాలు కావడంతో మళ్ళీ ఆర్థికంగా నిలద్రొక్కుకోవడానికి సినిమాలు చేయక తప్పలేదు.

అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో రోజురోజుకు మరింత సీరియస్ గా మారుతూ ఉండడంతో పవన్ కళ్యాణ్ కు సినిమాలో షూటింగ్స్ కు సరైన సమయంని కూడా కేటాయించడం లేదు. నిర్మాతల నుంచి కూడా అతనికి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. పవన్ మీద ఉన్న గౌరవంతో వాళ్లు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ కూడా సినిమా చేసేందుకు ఒప్పుకున్నప్పుడే తన పరిస్థితుల గురించి క్లారిటీగా చెప్పిన తర్వాతనే అడ్వాన్స్ తీసుకుంటున్నాడు.

అందుకే నిర్మాతలు పవన్ సమయాన్ని బట్టి షూటింగ్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు అలాగే వచ్చే ఎన్నికలను నేపథ్యంలో బిజీగా ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకే ఒక ఒక్క సినిమా షూటింగ్లో పాల్గొనాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో హరిహర విరమల్లు సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని ఫిక్స్ అయ్యాడట.

 ఆ సినిమాను తప్పించి మనకు షూటింగ్లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక భవదీయుడు భగత్ సింగ్ నిర్మాతతో పాటు మరొక రీమేక్ సినిమా కూడా చేయాలని అనుకున్న పవన్ ఇద్దరు దర్శక నిర్మాతలకు కూడా డైరెక్ట్ గా చెప్పేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు సినిమా చేయలేను అని ఆలోపు మీరు ఏదైనా సినిమాలు చేసుకుంటే చేసుకోండని కూడా వారికి తెలియజేసినట్లు సమాచారం. అవసరమైతే అడ్వాన్స్ కూడా వెనక్కి తిరిగి ఇవ్వడానికి సిద్ధమే అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ ను అనుకున్న సమయానికి ఫినిష్ చేస్తాడో లేదో చూడాలి.
Tags:    

Similar News