రీల్ సిద్దూ.. మధుమతి మళ్లీ జత కట్టనున్నారా?

Update: 2020-02-17 05:23 GMT
పవన్ సినిమాల్లో ప్రత్యేకమైన మూవీగా ఖుషీని చెబుతారు. అప్పట్లో ట్రెండ్ సెట్ చేయటమే కాదు.. రికార్డు వసూళ్లను సాధించిందా చిత్రం. ఈ సినిమాలో పవన్.. భూమిక కాంబినేషన్ అదిరేలా ఉన్నా.. తర్వాత వారిద్దరూ కలిసి పని చేసింది లేదు. అంత పెద్ద హిట్ పెయిర్ జత కట్టలేదు.

వీరిద్దరూ సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ చేస్తున్నారు. ఒకేసారి మూడు సినిమాలకు ఓకే చెప్పి.. మాంచి ఊపు మీద ఉన్న పవన్.. క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఒక హీరోయిన్ గా భూమికతో పవన్ జత కట్టనున్నారని చెబుతున్నారు.

ఇప్పటికే వదిన పాత్రలు.. అక్క పాత్రలతో పాటు ఆంటీ పాత్రలు చేస్తున్న భూమికతో పవన్ కాంబినేషన్ ఏ తీరులో ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా రీల్ సిద్దూ..మధుమతి పాత్రల్లో ప్రేక్షకుల మదిలో నిలిచినపోయిన ఈ జంట..దాదాపు పందొమ్మిదేళ్ల తర్వాత జత కట్టటం ఒక విశేషమైతే.. ఆ సినిమాలో వీరి పాత్రలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News