'త్రివిక్రమ్'కు నో చెప్పిన స్టార్.. అందుకేనా?

Update: 2020-05-19 06:50 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట. పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరో కొన్ని ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టారు. ఇదిలా ఉండగా కరోనా భయంతో షూటింగ్స్ నిలిచి పోవడం వలన వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కోరిన దానికి రెట్టింపు చేశారు పవన్. ఆయన నుండి మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుంది. అలాగే సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేరే కొత్త సినిమాలేవీ ఓకే చేయకూడని ఫిక్స్ అయ్యారట.

ఇప్పటికే నిర్మాతలు చాలా మంది ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం కొత్త చిత్రాలకు సంబందించిన ఒప్పందాలు ఆపేయాలని అనుకుంటున్నట్లు మొన్నటి వరకు టాక్ నడిచింది. అవేవి నిజం కాదన్నట్లు.. మరో కొత్త కథ విన్నాడట పవన్. పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ మధ్య ఎంతటి స్నేహం ఉందో అందరికి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా, వాటిలో రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. నాలుగో సినిమా రావడానికి కూడా చాలా  అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే, పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేసి ఆయనకి వినిపించడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా నో చెప్పడం కూడా జరిగిపోయాయట. ఎందుకంటే.. త్రివిక్రమ్ కథ నచ్చక నో చెప్పాడని టాక్ నడుస్తుంది.. కానీ ప్రస్తుతం వరుస సినిమాలు పూర్తయితే చూద్దాం అని.. అందుకే నో చెప్పినట్లు సమాచారం.
Tags:    

Similar News