2 ఏళ్ళ తర్వాత.. పవన్‌ రొమాన్స్‌

Update: 2015-09-09 11:41 GMT
అత్తారింటికి దారేది తర్వాత.. మళ్లీ ఇన్నాళ్లకి హీరోయిన్ తో చిందులేయబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ సినిమాలో కేరక్టర్ స్మూత్ అయినా.. రొమాంటిక్ ఫీల్ బాగానే గుప్పించారు. ఫస్ట్ హాఫ్ లో ప్రణీతతో, సెకండాఫ్ లో సమంతతో పవన్ చేసే అల్లరి చేసే ఓ విపరీతంగా ఆకట్టుకుంటుంది.. అంతే కాదు... పార్టీ సాంగ్‌ లో అయితే చుట్టూతా అందమైన అమ్మాయిలతో.. పవన్ ఒక్కడే మేల్ కేరక్టర్ కనిపించే సాంగ్ అయితే... అసలిది పవర్ స్టార్ కే సాధ్యం అనిపిస్తుంది.

ఆ తర్వాత ఇప్పటివరకూ పవన్ ఏ హీరోయిన్ తోనూ కలిసి నటించలేదు. గోపాలాగోపాలా మూవీ రిలీజ్ అయినా... అందులో పవర్ స్టార్ పక్కన హీరోయిన్ ఉండదు. దీంతో రొమంటిక్ సీన్స్ లో చూసే అవకాశం లభించలేదు. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్న పవర్ స్టార్... కాజల్ తో కలిసి కనువిందు చేయబోతున్నాడు. తొలిసారిగా పవన్ తో జతకట్టడంపై కాజల్ కూడా ఖుషీగానే ఉంది. గబ్బర్ సింగ్ ఫస్ట్ పార్ట్ లో శృతిహాసన్ తో పవన్ రొమాన్స్ చూడముచ్చటగా ఉంటుంది. అంతకుమించిన థ్రిల్ ఈ మూవీలో ఉంటుదంటున్నాడు డైరెక్టర్ బాబీ.

సర్దార్ గబ్బర్ సింగ్ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు పవన్ కళ్యాణ్. నటీనటులందరితోనూ మరో షెడ్యూల్స్ లో షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు. పవర్ స్టార్ ఆర్డరేశాక... అన్ని ఆటోమేటిగ్గా జరగాల్సిందే కదా.. లేకపోతే గబ్బర్ సింగ్ ఫైర్ అవుతాడు
Tags:    

Similar News