ప‌వ‌న్ ఇంటికొచ్చాడు.. ఎంక్వ‌యిరీ చేశాడు

Update: 2015-10-29 05:56 GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంట్లో దొంగ‌లు ప‌డ్డారు! ఇటీవ‌లి కాలంలో హాట్ టాపిక్ ఇది. ఓ వైపు ప‌వ‌ర్‌ స్టార్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ షూటింగులో బిజీగా ఉంటే అత‌డి ఇంట్లో దొంగ‌త‌నానికి తెగ‌ప‌డ్డారు అన్న వార్త అభిమానుల్లో క‌ల‌క‌లం రేపింది. ఓ ఇద్ద‌రు తాగి వ‌చ్చి మేం ప‌వ‌న్ కి వీరాభిమానులం .. ఆయ‌న‌తో ఫోటో దిగాలి.. అంటూ బంజారాహిల్స్‌ లోని ప‌వ‌న్ ఇంటిముందు వీరంగం వేశారు.

అంతేకాదు సెక్యూరిటీ గార్డుల్ని తోసుకుంటూ గోడ దూకి, గేటుదాటి లోనికి వెళ్లారు. లోప‌ల గార్డులు వారిని వారించేందుకు నానా పాట్లు ప‌డ్డారు. ఏదైతేనేం ఆ సంగ‌తి గుజ‌రాత్‌లో షూటింగులో పాల్గొంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టికి వెళ్లింది. వెంట‌నే త‌న స్నేహితుడు కోన వెంక‌ట్‌ కి ఫోన్ చేసి ఇల్లు ఎలా ఉంది ప‌రిశీలించండి అంటూ కోరాడు. ఏదైతేనేం ఆ త‌ర్వాత ఆ రుబాబ్‌ కి కార‌ణ‌మైన ఇద్ద‌రిని పోలీసులు ప‌ట్టుకుని జైల్లో వేశారు. విచార‌ణ సాగించారు.

ఆ ఇన్సిడెంట్ త‌ర్వాత ఇన్నాళ్టికి ప‌వ‌న్ హైద‌రాబాద్‌ లో అడుగుపెట్టాడు. వ‌స్తూనే త‌న ఇంటికి వెళ్లి ఏం జ‌రిగింది? అంటూ గార్డుల్ని ఆరా తీశాడు. అంతా బాగానే ఉంది అనుకుని గుండెల‌పై చెయ్యి వేసుకున్నాడు. సెక్యూరిటీని ఇక నుంచి అలెర్టుగా ఉండ‌మ‌ని చెప్పాడు. ఇక న‌వంబ‌ర్ 1 నుంచి హైద‌రాబాద్‌ లోనే స‌ర్ధార్‌ జీ షూటింగ్ ఉంటుంది. కొన్నిరోజుల షూట్ త‌ర్వాత మ‌ళ్లీ గుజ‌రాత్‌ లో షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈలోగా చిత్ర‌యూనిట్ అక్క‌డ మ‌రిన్ని లొకేష‌న్ల‌ను వెతికే ప‌నిలో ఉన్నార‌ని స‌మాచారం. అదీ మ్యాట‌రు.
Tags:    

Similar News