• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ మూవీ రిలీజ్ డేట్...

పవన్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారా?

By - Tupaki Desk
Update: 2020-01-17 05:38 GMT
సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. పూర్తిస్థాయి రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయటంతోపాటు.. పవన్ తో సినిమా తీయాలన్న కల నెరవేరుతుందని చెప్పుకొచ్చారు.

ఈ నెల 20న ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతున్నప్పటికీ.. ఫిబ్రవరిలో కానీ పవన్ షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ కాదంటున్నారు. ఈ సినిమా కోసం కేవలం పవన్ కేవలం 20 రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూట్ ఇప్పటివరకూ ప్రారంభం కాకున్నా.. రిలీజ్ డేట్ కు సంబంధించిన వివరాలు బయటకు రావటం ఆసక్తికరంగా మారింది.

దిల్ రాజు.. బోనీకపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే.. తాను చేస్తున్న సినిమా గురించి పవన్ ఇప్పటివరకూ మాట్లాడింది లేదు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ కోర్టు సెట్ వేస్తున్నారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ కోర్టు హాల్లోనే పూర్తి చేయనున్నారు. వేగంగా ఈ సినిమా చిత్రీకరణ సాగుతుందని.. మే 23న ఈ సినిమాను విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవిధంగా చూస్తే.. కొంత గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న ఈ చిత్రం మీద అంచనాలు భారీగా ఉన్నాయి. 'అజ్ఞాత‌వాసి' దారుణ పరాజయం తర్వాత పవన్ సినిమాలు చేయలేదు. మరి.. తాజా రీమేక్ తో తానేమిటో చూపిస్తారా? అన్నది ఒక ప్రశ్న.

పవన్ సినిమా అన్న తర్వాత కాసిన్ని ఫైట్లు.. ఒకట్రెండు పాటలు లేకపోతే బాగుండదు కాబట్టి.. అందుకు తగ్గట్లుగా పింక్ ఒరిజినల్ చిత్రంలోని కొంత మార్పులు చేసి.. పవన్ కు అనుగుణంగా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తానికి క్లాప్ కొట్టకుండానే సినిమా రిలీజ్ డేట్ బయటకు రావటం టాలీవుడ్ లో ఇదే తొలిసారి అని చెప్పక తప్పదు.


Tags:    
  • Pawan Kalyan 
  • Pink Remake 
  • Telugu News 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS