చిరు 150పై పెదవి విప్పని పవన్

Update: 2016-05-03 11:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అ..ఆ.. ఆడియో విడుదల ఫంక్షన్ కు వచ్చాడు. అంతే కాదు.. తన అభిమాని అయిన హీరో నితిన్ ని.. తమ్ముడి లాంటి వాడంటూ పొగిడేశాడు. పవన్ ఇలా ఇతరుల గురించి మాట్లాడితే వినేందుకు వినసొంపుగానే ఉంటుంది. కానీ ఒక విషయంలో మాత్రం మెగాఫ్యాన్స్ ని మళ్లీ నిరుత్సాహపరిచాడు పవన్ కళ్యాణ్.

ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాతో ఫ్యాన్స్ ఓ సారి డిజప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రీఎంట్రీ ఇస్తున్న 150 సినిమా ప్రారంభ కార్యక్రమంలో కూడా పవన్ కనిపించలేదు. కనీసం మైక్ చేత్తో పట్టుకున్నప్పుడయినా.. చిరంజీవి గురించి, ఆయన రీఎంట్రీ గురించి, 150వ సినిమా గురించి నాలుగు మాటలు మాట్లాడతాడని ఆశించినవారికి నిరుత్సాహమే మిగిలింది.

ఎక్కడా సర్దార్ గురించి కానీ, చిరు గురించి కానీ నోరు మెదపకుండానే తన స్పీచ్ కంప్లీట్ చేసేశాడు పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ ని - నితిన్ ని - సమంతను గుర్తుపెట్టుకుని, తెచ్చుకుని మరీ పొగిడిన పవన్ కి.. అన్నయ్య సినిమా గురించి కనీసం ఓ మాట కూడా చెప్పాలని అనిపించకపోవడం ఆశ్చర్యకరమే. చిరంజీవి గురించి పవన్ నోటి వెంట నాలుగు మాటలు వినాలనే కోరికను మాత్రం.. పవన్ నెరవేర్చకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు.
Tags:    

Similar News