వైవాహిక బంధానికి ఆరేళ్లు.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన మిహికా బజాజ్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి వారసుడు.. దగ్గుబాటి రానా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.

Update: 2026-08-08 06:24 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి వారసుడు.. దగ్గుబాటి రానా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విభిన్నమైన కథలతో ,అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా అలరిస్తున్న రానా.. సినిమాలను కూడా నిర్మిస్తూ బిజీగా మారిపోయారు. ఇకపోతే ఆయన భార్య మిహీకా బజాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె రానా భార్య మాత్రమే కాదు ఇంటీరియర్ డిజైనర్గా, ఆంత్రప్రెన్యూర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.




నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే మిహీకా బజాజ్ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా పంచుకున్న పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2020 ఆగస్టు 8వ తేదీన దగ్గుబాటి రానా, మిహీకా బజాజ్ కరోనా నిబంధనల ప్రకారం కేవలం 30 మంది సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక నేటితో ఆ వివాహ బంధానికి ఆరేళ్లు పూర్తి కావడంతో స్పెషల్గా నాటి పెళ్లినాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేస్తూ లవ్ ఎమోజిని షేర్ చేసింది మిహీకా బజాజ్. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రానా, మిహీకా బజాజ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

ఇదిలా ఉండగా ఆ పెళ్లి వేడుకల్లో మిహీకా బజాజ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ విపరీతంగా ఫ్యాషన్ ప్రియులను మెప్పించింది. ఈమె చూడడానికి సింపుల్ గా కనిపించినా..అందులో చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ఒక డిజైనర్ ఈ డ్రెస్ కోసం ఏకంగా వెయ్యి గంటలు కష్టపడింది . ప్రముఖ డిజైనర్ అనామిక ఖన్నా ఆ లెహంగాను తయారు చేసింది. గోల్డెన్ కలర్ తో పాటు ఐవరీ కలర్ మిక్స్ చేస్తూ తయారుచేసిన ఆ డిజైనర్ డ్రెస్ కోసం ఏకంగా 1000 గంటలు శ్రమించాల్సి వచ్చిందని సమాచారం. పూర్తిగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ తో ఆ డ్రెస్ ను డిజైన్ చేశారు. దాని కోసం ఆరు లక్షల రూపాయలు వరకు ఖర్చుపెట్టినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా గత నాలుగు నెలల క్రితం ఆర్ట్ కనెక్ట్ వేదికగా మైదా అనే ఆర్ట్ షోను ప్రారంభించిన ఈమె...తన కెరియర్, సామాజిక సేవా కార్యక్రమాల గురించి కూడా వివరించింది .ఈ సందర్భంగా అక్కినేని దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చిన కోడలిగా మీరు సినిమాలోకి వస్తారా? అడిగిన ప్రశ్నకు.." నాకు సినిమాలపై , నటీనటులపై గౌరవం ఉంది. కానీ నా ప్రపంచం కెమెరా వెనుక ఉంది. డిజైనింగ్ లోనే నేను నా సృజనాత్మకతను చూపిస్తాను. కథలు చెప్పడం అనేది ఒక ప్రత్యేకమైన నైపుణ్యం.. అది తెలిసిన వారే చేయాలి.. నా వల్ల కాదు అంటూ స్పష్టం చేసింది.

ఇకపోతే ఈమె మోడా అనే ఎన్జీవోని కూడా ప్రారంభించినట్లు తెలిసింది. మోడా అంటే ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడం అని అర్థం. ఎంతో మంది సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రయాణంలో మాకు సహాయం చేస్తున్నారు అని కూడా తెలిపింది మిహీకా బజాజ్.

Tags:    

Similar News