OTT లోకి స్టార్ డైరెక్టర్ల ఎంట్రీ.. టాలీవుడ్‌లో కొత్త గేమ్ మొదలైందా?
రీసెంట్ గా డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సిద్ధు జొన్నలగడ్డ- మీనాక్షి చౌదరి వెబ్ సిరీస్ 2027 ప్రారంభంలో రిలీజ్ కానున్నట్లు ఆయనొక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఒకప్పుడు వెబ్ సిరీస్‌లను ఎక్కువగా కొత్త డైరెక్టర్లు, కొత్త నటీనటులు, చిన్న బడ్జెట్ కథల కోసం ఉపయోగించే ప్లాట్‌ఫామ్ గా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్టార్ డైరెక్టర్లు కూడా ఓటీటీ కోసం ప్రత్యేక కథలను రూపొందించడం, ప్రముఖ హీరోలు వెబ్ సిరీస్‌లలో నటించడం, పెద్ద నిర్మాణ సంస్థలు డిజిటల్ కంటెంట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టడం చూస్తే ఓటీటీ ఇక ప్రత్యామ్నాయ మాధ్యమం కాదని, మెయిన్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ గా మారిందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ మార్పుకు ప్రధాన కారణం కథ చెప్పే స్వేచ్ఛ. రెండు లేదా మూడు గంటల సినిమా నిడివిలో చెప్పలేని కథలను వెబ్ సిరీస్ ఫార్మాట్‌లో మరింత విస్తృతంగా ఆవిష్కరించే అవకాశం డైరెక్టర్లకు లభిస్తోంది. క్యారెక్టర్ల డెవలప్‌మెంట్, ఎమోషనల్ బిల్డింగ్, థ్రిల్లర్ లేదా డ్రామా ఎలిమెంట్లను నెమ్మదిగా నిర్మించే ఛాన్స్ ఓటీటీలో ఎక్కువగా ఉంటుంది. అందుకే స్టార్ డైరెక్టర్లు కూడా డిజిటల్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
రీసెంట్ గా డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సిద్ధు జొన్నలగడ్డ- మీనాక్షి చౌదరి వెబ్ సిరీస్ 2027 ప్రారంభంలో రిలీజ్ కానున్నట్లు ఆయనొక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది కూడా ఈ మారుతున్న ధోరణికి మరో ఎగ్జాంపుల్ గా మారింది. థియేటర్లలో సక్సెస్‌లు సాధించిన డైరెక్టర్లు ఇప్పుడు ఓటీటీ కోసం ప్రత్యేక కథన నిర్మాణాన్ని ఎంచుకోవడం ఇండస్ట్రీలో కొత్త స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఇక యంగ్ డైరెక్టర్లకు ఓటీటీ నిజంగా ప్రయోగాల వేదికగా మారింది. థియేటర్ మార్కెట్ ఒత్తిడి, ఓపెనింగ్స్, కలెక్షన్ల లెక్కల కంటే కథ, స్క్రీన్‌ప్లే, కథన శైలిపై ఎక్కువ దృష్టి పెట్టే ఇక్కడ వారికి లభిస్తోంది. అందువల్ల కొత్త జానర్లు, నాన్- లీనియర్ నేరేషన్, డార్క్ కామెడీ, సైకాలజికల్ డ్రామా, లాంగ్ ఫార్మ్ కథనాలు వంటి ప్రయోగాలు పెరుగుతున్నాయి.
అదే సమయంలో హీరోలకు కూడా వెబ్ సిరీస్‌లు బ్రాండ్‌ను విస్తరించే సాధనంగా మారుతున్నాయి. సినీ ఆడియన్స్ తో పాటూ డిజిటల్ ఆడియన్స్ ను చేరుకోవడం, కొత్త భాషల ఆడియన్స్ లో గుర్తింపు పొందడం, విభిన్న క్యారెక్టర్లను ట్రై చేయడం ద్వారా వారి మార్కెట్ మరింత విస్తరించే అవకాశముంది. ఇది కెరీర్ రిస్క్‌ను కొంత మేర తగ్గించే అంశంగా కూడా పరిగణిస్తున్నారు.
సినిమా, వెబ్ సిరీస్ రెండింటినీ సమాంతరంగా ప్లాన్ చేసే మోడల్ ఇప్పుడు వేగంగా పెరుగుతోంది. ఫ్యూచర్ లో డైరెక్టర్లు ఒకేసారి థియేటర్ మరియు ఓటీటీ కోసం వేర్వేరు కథలను డెవలప్ చేయడం సాధారణ ప్రక్రియగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటీటీ ఇక కేవలం రిలీజ్ ప్లాట్‌ఫామ్ గా కాకుండా డైరెక్టర్ల క్రియేటివ్ ఎక్స్‌పెరిమెంట్స్‌కు, హీరోల బ్రాండ్ విస్తరణకు, నిర్మాతల దీర్ఘకాలిక వ్యూహాలకు కీలక భాగంగా మారుతోంది.