ఏజ్ గ్యాప్ ల‌వ్ స్టోరీల‌కు కొత్త దారి.. సౌత్ డైరెక్ట‌ర్ల ఫోక‌స్ మారిందా?

ఇటీవలి కాలంలో ఆడియ‌న్స్ టాక్సిక్ రిలేషన్‌షిప్స్ కంటే ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సంబంధాలను ఎక్కువగా స్వీకరిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది.

Update: 2026-08-08 06:33 GMT

హీరోహీరోయిన్ల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఉన్న రిలేష‌న్స్ ను చూపించే విధానం సౌత్ సినిమాల్లో క్రమంగా మారుతున్నట్లు తాజా సినిమాల‌ ఎంపిక చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇలాంటి కథలు ప్రధానంగా రొమాంటిక్ యాంగిల్ లేదా కాంట్ర‌వ‌ర్సీ అంశంగా మలచబడేవి. కానీ ఇప్పుడు డైరెక్ట‌ర్లు వాటిని మ‌రింత ఎమోష‌న‌ల్ మెచ్యూరిటీ, పరస్పర గౌరవం, వ్యక్తిగత ఎదుగుదల వంటి అంశాలతో అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్పు కేవలం కథల శైలిలోనే కాదు, ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన పరిణామాన్ని కూడా ప్రతిబింబిస్తోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో ఆడియ‌న్స్ టాక్సిక్ రిలేషన్‌షిప్స్ కంటే ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సంబంధాలను ఎక్కువగా స్వీకరిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. సోషల్ మీడియా డిస్క‌ష‌న్స్, న్యూ ఏజ్ ఆడియ‌న్స్ పెర్స్పెక్టివ్, హీరోయిన్ క్యారెక్ట‌ర్ ప్రాధాన్య‌త పెరగడం వంటి అంశాలు కూడా ఈ మార్పుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏజ్ గ్యాప్ ఉన్న పాత్రల మధ్య అనుబంధాన్ని కేవలం ప్రేమ కథగా కాకుండా, ఇన్సిపిరేషన్, ఆరాధన, ఎమోష‌న‌ల్ బాండింగ్ వంటి యాంగిల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో విశ్వనాథ్ & సన్స్ సినిమాలో సూర్య, మమిత బైజు క్యారెక్ట‌ర్ల‌ను డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి డిజైన్ చేసిన విధానం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో సూర్య‌, మ‌మిత క్యారెక్ట‌ర్ల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ను అంద‌రిలా కేవ‌లం గ్లామ‌ర్ కోస‌మేనో, దాన్నొక కామెడీ ట్రాక్ గా లేదంటే అస‌భ్యంగా పెట్ట‌లేద‌ని, క‌థ‌లో ఆయా పాత్ర‌ల జీవిత ప్రయాణాలు, మెచ్యూరిటీ వంటి అంశాల ద్వారా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే సినిమాలో రొమాంటిక్ ట్రోప్‌ను ముందుకు తేవడం కంటే, పాత్రల మధ్య ఏర్పడే ఎమోషనల్ కనెక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇది మరో పెద్ద ట్రెండ్‌కు కూడా సంకేతంగా కనిపిస్తోంది. జనరేషన్ గ్యాప్ కథలను ఇప్పుడు డైరెక్ట‌ర్లు కొత్త దృక్పథంతో చూడడం మొద‌లుపెట్టే అవ‌కాశ‌ముంది. ఏజ్ గ్యాప్ అనేది సంఘర్షణకు కారణం కాకుండా, జీవిత అనుభవాల మార్పిడి, పరస్పర అవగాహన, ఎమోష‌న‌ల్ బాండింగ్ వంటి అంశాలకు వేదికగా మారుతోంది. ఈ విధానం ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను కూడా ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎమోషనల్ డ్రామాలు, ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌కు మళ్లీ ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో, విశ్వనాథ్ & సన్స్ వంటి సినిమాలు ఆ మార్పును మరింత బలపరుస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఏజ్ గ్యాప్ ఉన్న క్యారెక్ట‌ర్ల మధ్య బాండింగ్ ను రొమాన్స్‌కు అతీతంగా చూపించే కథలు ఫ్యూచ‌ర్ లో మరింత పెరిగే అవకాశం ఉందనే డిస్క‌ష‌న్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News